will quit Rajya Sabha says Mayawati మాట్లాడనివ్వండీ లేదా రాజీనామా చేస్తా: మాయావతి

Angry at not being allowed to speak bsp chief mayawati

mayawati, will quit Rajya Sabha says Mayawati, deputy chairman kuriyan, attack on dalits, attack on minorities, go rakshak samitis, Sitaram Yechury, Rajya Sabha, Mukhtar Abbas Naqvi, Congress, BSP, BJP

Things took a serious turn in the Rajya Sabha on Tuesday when BSP chief Mayawati said she will quit as Parliamentarian for 'not being allowed to speak" about atrocities against Dalits and minorities.

అన్నట్లుగానే రాజీనామా చేసిన మాయావతి

Posted: 07/18/2017 03:19 PM IST
Angry at not being allowed to speak bsp chief mayawati

బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నంత పని చేశారు. అమె తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సభలో సభ్యురాలిగా కొనసాగుతూ కూడా అణగారిన వర్గాలకు జరుగుతున్న అన్యాయాలపై.. గొంతు వినిపించే అవకాశం ఇవ్వకపోవడమని అన్న అమె.. తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దళితులు, మైనారిటీలపై జరుగుతున్న దాడుల విషయాన్ని రాజ్యసభలో ప్రస్తావిస్తుండగా, తనకు సమయాన్ని కేటాయించికపోవడంతో అమె ఇవాళ ఉదయం తనను మాట్లాడనివ్వాలని కోరారు. లేని పక్షంలో తాను తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడానికి కూడా వెనుకాడబోనని చెప్పారు. అయితే చైర్మన్ స్థానంలో వున్న ఢిప్యూటీ చైర్మన్ అమెకు సమయాన్ని కేటాయించకపోవడంతో కలత చెందిన అమె సభ నుంచి వాకౌట్ చేశారు. కాగా సాయంత్రం అమె తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అసలేం జరిగిందంటే..

తాను ఒక పార్టీకి అధ్యక్షురాలి, అంతకు మించి అనగారిణ బహుజనల ప్రతినిధిని.. దీనికి తోడు రాజ్యసభ సభ్యురాలి.. తన అణగారిన వర్గాలపై జరుగుతున్న దాడుల అంశాన్ని లేవనెత్తున్న క్రమంలో తనను మాట్లాడించేందుకు సమయాన్ని కేటాయించాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి రాజ్యసభలో అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో దళిత వర్గాలుపై జరుగుతున్న దాడుల విషయమై తాను ప్రస్తావించ దలిచానని చెప్పారు. బీజేపి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గో రక్షక సంఘాల పేరుతో దళితులపై దాడులు జరుగుతున్నాయని అమె అరోపించారు.

మాయావతి లేవనెత్తిన అంశాలపై మాట్లాడేందుకు డిప్యూటీ ఛైర్మన్‌ కురియన్ సమయాన్ని కేటాయించలేదు. దీంతో కోపోద్రిక్తురాలైన అమె.. నేను మాట్లాడేందుకు సభలో ఇప్పుడు సమయాన్ని కేటాయించండీ.. లేని పక్షంలో నేను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని అన్నారు. యూపీలోని షహ్రాన్‌పూర్‌లో దళితులను లక్ష్యంగా చేసుకుని వరుసగా దాడులు చేపడుతున్నారని, సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తే తనకు మాట్లాడే అవకాశం కల్పించలేదని ఆమె తెలిపారు. అనంతరం ఆమె సభ నుంచి వాకౌట్ చేసి బయటికి వెళ్లిపోయారు. దీంతో సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

దళితులపై దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నా.. వాటిపై కనీసం సభలో చర్చ లేకపోవడం, ఎంపీలను మాట్లాడనీయకపోవడంపై అమె మీడియా ముఖంగా తీవ్రంగా అక్షేపించారు. బీజేపి అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా గోరక్షణ సంఘాలకు ఎందుకు ఎక్కడ లేని బలం వస్తుందని అమె ప్రశ్నించారు.  అయితే మాయావతి తక్షణం సభకు క్షమాపణ చెప్పాలని కేంద్రమంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ డిమాండ్ చేశారు. హుందాగా ప్రవర్తించాల్సిన సభలో అమె అగౌరవంగా ప్రవర్తించారని.. సభాపతికే సవాలు విసిరేలా అమె చర్యలు వున్నాయని అన్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mayawati  Sitaram Yechury  Rajya Sabha  Mukhtar Abbas Naqvi  Congress  BSP  BJP  

Other Articles