insult to ap minister at smr college in amaravathi అన్నన్నన్నా.. అయ్యన్నా.. అమరావతిలో అవమానమా..!

Bitter experiance to ap minister at smr college opening ceremony

ayyanna patrudu, SRM university, bitter experience, ganta srinivas, chandrababu naidu, venkaiah naidu, amaravathi, andhra pradesh

A Big Insult to andhra pradesh minister ayyanna pathrudu in amaravathi at SMR college opening ceremony, where he told he himself is a minister, but the police never allowed him on to the dias. facing bitter experiance minister left from the spot.

అన్నన్నన్నా.. అయ్యన్నా.. అమరావతిలో అవమానమా..!

Posted: 07/15/2017 05:49 PM IST
Bitter experiance to ap minister at smr college opening ceremony

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సాక్షిగా మంత్రి అయ్యన్నపాత్రుడికి పరాభవం జరిగింది. ఇది కావాలని జరిగిందా..? లేక కాకతాళీయంగా జరిగిందా..? అన్న విషయం తెలియదు కానీ.. తన రాజధానిలో ఓ మంత్రికి తాను మంత్రిని అనుమతించండీ అని చెప్పుకోవాల్సిన దుర్భర పరిస్థితి రావడం మాత్రం ఆక్షేపనీయం. కానీ అదే జరిగింది. ఏదో మారుమూల ప్రాంతంలో లేక రాష్ట్రం కాని రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరిగితే అర్థం చేసుకోవచ్చు.. కానీ సొంత రాష్ట్రంలో అమాత్యులకే అవమానం జరిగితే.. ఎవరినీ అడగాలి..? అసలు ఆ మంత్రి తన అవేధనను ఎవరికి చెప్పుకోవాలి.

ఎస్‌ఆర్‌ఎం యూనివర్శిటీ ప్రారంభోత్సవంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి మంత్రి అయ్యన్నపాత్రుడికి ఈ చేదు అనుభవం ఎదురైంది. స్టేజీజైకి వెళ్లేందుకు వెళ్తున్న మంత్రి అయ్యన్నపాత్రుడిని పోలీసు సిబ్బంది అడ్డుకున్నారు. ఆయనను అడిటోరియం లోనికి వెళ్లనీయకుండా ఆంధ్రప్రదేశ్ పోలీసులే అడ్డుకున్నారు. తనకు ఎదురైన వింత పరిస్థితికి ఖంగుతిన్న మంత్రి తాను.. ఆంధ్రప్రదేశ్ మంత్రినని చెప్పుకోవాల్సి వచ్చింది. అయినా వారు లోనికి అనుమతించలేదు. బారికేడ్లు తొలగించేందుకు పోలీసులు నిరాకరించారు. దీంతో ఆయన ఆగ్రహంతో వెనుదిరిగారు.

అయితే ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్‌ కోన శశిధర్‌ ...మంత్రి అయ్యన్నకు ఫోన్‌ చేసి.. కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా కోరారు. అయితే ఆందుకు ఆయన నిరాకరించారు. అయ్యన్నతోపాటు పలువురు అతిథులను.. ప్రముఖులను కూడా లోపలికి వెళ్లకుండా గుంటూరు పోలీసులు ఇబ్బందులకు గురి చేశారు. ఇది మంత్రి గంటా శ్రీనివాసరావే ఇలా చేయించారని అయ్యన్న వర్గీయులు మండిపడుతున్నారు. విశాఖ భూ కబ్జాల వ్యవహారంలో మంత్రులు గంటా, అయ్యన్న మధ్య విభేదాలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో ఇలా ప్రతీకారేచ్ఛ తీర్చుకున్నారని భావిస్తున్నారు. కాగా అయ్యన్న మాత్రం...రాజకీయ నాయకులకు అవమానాలు, గౌరవాలు సహజమేనన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles