Texas cash machine sends 'help me' notes ఏటీయం నుంచి డబ్బులకు బదులు.. విచిత్ర నోట్..!

Help me note from texas atm instead of money

Bank of America, ATM, contractor, corpus christi, texas, help me notes, help me slips, man stuck in atm, Essex, man stuck in atm america

A Texas man who got locked inside an ATM room slipped “help me” notes through a receipt slot to be rescued.

ఏటీయం నుంచి డబ్బులకు బదులు.. విచిత్ర నోట్..!

Posted: 07/15/2017 04:45 PM IST
Help me note from texas atm instead of money

అమెరికాలోని టెక్సాస్‌ ప్రావిన్సులోని కార్పస్ క్రిస్టి పరిధిలోని ఓ ఏటీఎం వద్ద అసక్తికర ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా వున్న బ్యాంక్ అప్ అమెరికా ఏటీయం నుంచి డబ్బులు డ్రా చేసుకునేందుకు వచ్చిన ఖాతాదారులకు విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. తమ కార్డు స్వైప్ చేసిన ప్రతీ ఖాతాదారుడికి ఇదే అనుభవం ఎదురైంది. అయితే డబ్బులు మాత్రం రావడం లేదు. అయితే అందుకు బదులుగా ఓ వింత నోటు దర్శనమిచ్చింది. తాను ఈ ఏటీయం కేంద్రంలో ఇరక్కుపోయానని, తన బాస్ కు ఫోన్ చేని తనకు విముక్తి కల్పించాలని నోట్ లో చిన్న సందేశం వుంది.

ఏటీఎం కేంద్రంలో ఏటీయం ఇరుక్కుపోయిందా అంటూ కొందరు భావించి దానిని జోక్ గా తీసుకున్నారు. వావ్.. ఏటీయం కేంద్రంలో కరెన్సీ నోట్లకు బదులు ఈ నోట్ ఇరుక్కుపోయిందని మరికొందరు తమ హస్య చతరుతకు పదను పెట్టారు. ఇంకొందరు దీనిని జోక్ గా కొట్టిపారేశారు. ఈ సంగతిని అస్సలు పట్టించుకోలేదు. అయితే నుంచి ఓ వింత నోటు..కాదు కాదు..వింత అభ్యర్థన దర్శనిమిచ్చింది. కొంతమంది దీన్ని  జోక్‌ అనుకొని కొట్టిపారేశారు. మరికొంతమంది ఈ సంగతిని అస్సలు పట్టించుకోలేదు. అయితే ఓ ధర్మాత్ముడు మాత్రం స్పందించి పుణ్యం కట్టుకున్నాడు.

ఏటీయం కేంద్రంలోంచి చిన్నగా శబ్దం వినిపించడంతో ఏదో అనుకోని ఘటన చోటుచేసుకుందన్న అనుమానంతో స్పందించిన ఓ ఖాతాదారుడు. అతని సూపర్ వైజర్ తో పాటు పోలీసులకు కూడా సమాచారం చేరవేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఏటీయం కేంద్రం తలుపులు బద్దులు కొట్టి బాధితున్ని బయటకు తీశారు. తాను యధావిధిగా ఏటీయం కేంద్రాలను మరమ్మతులు చేయడానికి వెళ్లగా అనుకోకుండా ఆలా జరిగిందని, అయితే ఏటీయం కేంద్రంలోకి ఫోన్ కూడా తీసుకెళ్లకుండా బయట నిలిపిన తన వాహనంలో పెట్టానని, దీంతో తాను ఈ అవస్థకు గురయ్యానని బాధితుడు చెప్పాడు.

బయటకు వచ్చే మార్గం లేక.. ఎంత అరిచినా పట్టించుకునే నాధుడు లేక ఈ ఉపాయాన్ని చేశానని, అయితే దీనిని కూడా పలువురు పలు రకాలుగా స్పందించారని, చివరకు ఓ పుణ్యాత్ముడు స్పందించి తనను కాపాడారని తెలిపాడు. తనను రక్షించమంటూ వేడుకుంటూ, తన యజమాని ఫోన్‌ నెంబర్‌ సహా  ఏటీఎం పేపర్‌ మీద రాసి, రిసీట్‌ స్లాట్‌ ద్వారా బయటికి వచ్చేలా చేశానని చెప్పాడు. అయితే సరిగ్గా ఇలాంటి ఘటనే 214లో ఎక్సెస్ లో జరిగింది. మళ్లీ టెక్సాస్ లో పునరావృతం అయ్యిందని అధికారులు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bank of America  ATM  contractor  corpus christi  texas  america  

Other Articles