Youth murdered brutally by three member gang in hyderabad బంజారాహిల్స్ లో మిట్టమధ్యాహ్నం యువకుడి హత్య

Youth murdered brutally by three member gang in hyderabad

youth stabbed to death, Banjara hills police station, rivalry between local groups, old criminal murdered in banjarahills, banjarahills police station, crime

A youth having criminal record is murdered brutally in broad day light in limits of banjara hills police station in hyderabad by three member gang.

బంజారాహిల్స్ లో మిట్టమధ్యాహ్నం యువకుడి హత్య

Posted: 07/08/2017 04:46 PM IST
Youth murdered brutally by three member gang in hyderabad

హైద‌రాబాద్ న‌గ‌రంలో దారుణ హత్య జరిగింది. మిట్టమధ్యాహ్నం అందరూ చూస్తుండగా ఓ యువకుడ్ని అతికిరాతంగా హత్యచేశారు. బంజారా హిల్స్ రోడ్ నంబరు 7లో ఈ ఘటన చోటుచేసుకోవడం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న అత‌డిని వెంబడించిన దుండగులు అత్యంత పాశవికంగా అతడ్ని కత్తులతో పోడిచి చంపారు. దీంతో యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పాత కక్ష‌లే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

ముందస్తుగా వేసుకున్న ప్రణాళికలో భాగంగా ఓ సెంటిల్ మెంట్ విషయమై అతడ్ని పరిచయస్తులతో బంజారాహిల్స్ కు రప్పించి.. దుండ‌గులు ఈ దారుణానికి పాల్ప‌డిన‌ట్లు స‌మాచారం. ఈ ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసుకుని, హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. నిందితుల‌ కోసం గాలింపు చ‌ర్య‌లును ప్రారంభించారు. యువకుడిని కత్తితో పొడిచిన దుండగుడు పోలీసుస్టేషన్ లో లొంగిపోయినట్లు సమాచారం. అయితే ఈ విషయమై పోలీసులు మాత్రం సమాధానం దాటవేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : youth  Banjara hills police station  rivalry gang  old criminal  murder  crime  

Other Articles