After Presidential Now Nitish to skip to VP Election Meet

Nitish silence on lalu raids signs of break up

Lalu Prasad yadav, Nitish Kumar, Lalu Nitish Break Up, Lalu CBI Raids Nitish Silent, Nitish Kumar Vice Presidential Election, Nitish Kumar Vice President Candidate, Lalu Raids CM Silent, Nitish Kumar Did It Again, Nitish Kumar Narendra Modi, Nitish Kumar Tejashwi Yadav

Bihar CM Nitish Kumar to skip opposition meet to decide vice presidential candidate. After Silence on Raids Against Ally Lalu Prasad, Nitish Kumar Cancels Public Event With Dy CM Tejashwi Yadav.

మాటల్లేవ్.. ఇక మిగిలింది బ్రేకపే!

Posted: 07/10/2017 08:10 AM IST
Nitish silence on lalu raids signs of break up

అధికారం కోసం చేతులు కలిపి కూటమి పేరుతో బీహార్ లో పాగా వేసిన నితీశ్, లాలూ ల మధ్య బ్రేకప్ కి టైం దగ్గర పడింది. రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసే టైంలో తమకు హ్యాండిచ్చిన బీహార్ సీఎంపై ఆర్జేడీ అధినేత ఫైరయిన విషయం తెలిసిందే. ఎన్డీయే అభ్యర్థికి మద్ధతు ఇచ్చి చారిత్రక తప్పు చేశాడంటూ ఓపెన్ గానే కామెంట్లు చేశాడు. దీంతో ఇద్దరి మధ్య గ్యాప్ మొదలవుతూ వస్తోంది. ఇక ఇప్పుడు మరోసారి ఝలక్ ఇవ్వబోతున్నాడనే సమాచారం అందుతోంది.

ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం మంగళవారం ఎన్డీయే యేతర పక్షాలు నిర్వహించనున్న సమావేశానికి డుమ్మా కొట్టాలని నితీశ్ నిర్ణయించాడు. రాష్ట్రపతి అభ్యర్థి నామినీ విషయంలో నితీశ్ ఇలానే చేయగా, మరోమారు ఆయన తప్పించుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. వైరల్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతుండడం వల్లే నితీశ్ రాలేకపోయాడని జేడీయూ వర్గాలు చెబుతుండగా, రేపు జరగబోయే శాసనసభ్యులు, ఎంపీలతో సమావేశంకు ఆయన హాజరు అవుతుండటం ఇక్కడ కొసమెరుపు.

కాగా, గత నెలలో రాష్ట్రపతి అభ్యర్థి నామినీ కోసం నిర్వహించిన 17 పార్టీల మీటింగ్‌కు హాజరు కాని నితీశ్, అదే రోజు ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసేందుకు వెళ్లడం ఆసక్తిని రేకిత్తించింది. అంతేకాదు ఎన్డీఏ ప్రకటించిన రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు బహిరంగంగా మద్దతు తెలిపి అగ్గి రాజేశారు. అలాగే నోట్ల రద్దు, సర్జికల్ దాడులను కూడా నితీశ్ సమర్థించారు. దీంతో మోదీకి మళ్లీ దగ్గరవుతున్నాడన్న అనుమానాలు మొదలయ్యాయి. అదే సమయంలో లాలూపై జరుగుతున్న సీబీఐ దాడులపై కనీసం పెదవి కూడా విప్పకపోవటం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇంకోవైపు లాలూ తనయుడు, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ను కూడా కలిసేందుకు నితీశ్ మొగ్గు చూపటం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో లాలూ-నితీశ్ మైత్రికి దగ్గర్లోనే శుభం కార్డు పడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bihar  Nitish Kumar  Lalu Prasad Yadav  CBI Raids  

Other Articles