laundry slip gives clue to catch bike thieves రోడ్డు ప్రమాదం.. లాండ్రీ చిట్టి ఎంత పని చేసింది..

Laundry slip gives clue to police in catching bike thieves

laundry slip cathes thieves, laundry slip gives clue in bike theft case, kojja mohan, sai ladda, meka narender, bike theives, laundry slip, two wheler thieves, police, chilakalaguda, jagadgiri gutta, crime

laundry slip gives clue to police in catching bike thieves in hyderabad as they were old criminals and were behind the bars for their crimes

రోడ్డు ప్రమాదం.. లాండ్రీ స్లిప్ ఎంత పని చేసింది..

Posted: 07/07/2017 04:18 PM IST
Laundry slip gives clue to police in catching bike thieves

కారు దిద్దిన కాపురం సినిమా టైటిల్ మాదిరిగా.. ఓ లాండ్రీ చీటి దొంగ‌ల‌ను ప‌ట్టించిందంటే విస్మయానికి గురవుతున్నారా..? కానీ ఇది నిజం. రోడ్డు ప్రమాదంలో వాహనం కిందపడిపోగానే.. దానికి అక్కడే వదిలేసి వెళ్లినపోవడంతో పోలీసులకు అనుమానాలు కలిగాయి. దీంతో అసలు ఈ వాహన యజమాని ఎవరు అన్న కోణంలో దర్యాప్తును ప్రారంభించిన పోలీసులకు అక్కడే అసలు ట్విస్టు ఎదురైంది. ఈ కేసును ఎలాగైనా చేధించాలని రంగంలోకి దిగిన క్రైం బృందం.. ఎట్లకేలకు సఫలత సాధించింది. ఏకంగా ఓ దొంగల ముఠానే అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు.

ఇదంతా సరే కానీ లాండ్రీ స్లిప్ దోంగలను ఎలా పట్టించిందనేగా..? ఈ అరెస్టులకు.. లాండ్రీ స్లిప్ కు సంబంధమేమిటీ అనేగా..? అక్కడికే వస్తున్నాం. అయితే అంతకన్న ముందుగా మరో మ్యాటర్లోకి ఎంటెర్ కావాలి.
కొజ్జా మోహ‌న్.. ఈజీ మనీ వేటలో జల్సాలకు అలవాడు పడి చదువు సంద్యలు వదిలేసి.. జనం వాహనాలను నమ్ముకుని బతికేస్తున్నాడు. ఇత‌ని క‌న్ను పడితే ఆ ద్విచక్ర వాహనం అదృశ్యం కావాల్సిందే. ప‌ట్టప‌గ‌లే ద్విచ‌క్ర వాహ‌నాలు ఎత్తుకెళ్ళి వ‌చ్చిన‌ కాడికి అమ్మేస్తుంటాడు. వచ్చిన డబ్బుతో విలాసాలు. చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు.

ఇతని పనితనం గురించి ఆలస్యంగా తెలుసుకన్న పోలీసులు చివరకు అతన్ని పట్టుకుని కటకటాల్లోకి నెట్టారు. పరివర్తన రావాల్సిన మోహన్ కు మరో ఇద్దరు తొడు దొంగలు కలిస్తే.. ఏమవుతుంది. అదే జరిగింది. జైలులో ఇత‌నికి బోర‌బండ‌కు చెందిన‌ సాయి ల‌డ్డా,  బాలాన‌గ‌ర్ కు చెందిన‌ మేక‌ న‌రేంద‌ర్ తో పరిచయం ఏర్పడింది. అదికాస్తా స్నేహంగా మార్చుకుని ముఠాగా ఏర్పడ్డారు. ఇక ఒక్కోక్కరుగా అంతా బెయిల్ పై బయటకు వచ్చాక ముఠాగా ఏర్పడి బైక్‌ల దొంగ‌త‌నాలు  ప్రారంభించారు.

ఇలా దొంగలించిన బైక్ పై యదేశ్ఛగా ప్రయాణిస్తూ.. ఇటీవ‌ల జ‌గ‌ద్గిరిగుట్టలో ప్రమాదం బారిన పడ్డారు. దీంతో పక్కనున్న వాహనదారులు వీరిని అడ్డగించబోగా వాహనాన్ని వదలి పారిపోయారు. పోలీసులు బైక్‌ను ప‌రిశీలించి దాని యజమానికి ఫోన్ చేయగా తన వాహనం దొంగలించారని సమాధానం వచ్చింది. దీంతో ఖంగుతిన్న పోలీసులు బైక్ కవర్ లో చూడగా ఒక‌ లాండ్రీ స్లిప్ దొరికింది. అందులో దొంగల అడ్రస్ లభించింది. దీంతో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి మొత్తం 8 బైక్ లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : laundry slip  bike thieves  police  chilakalaguda  jagadgiri gutta  crime  

Other Articles