Face-off at Border Shake Hand at Hamburg

Modi silence on china border tensions

India-China Face-off, Modi and Xi Jinping Shake Hand, Modi Xi Jinping G20, Modi Hamburg G20 Summit, India China Border, Rahul Gandhi Modi Weak PM, G20 Highlights

India-China Face-off at Sikkim Border. But, Modi and Xi Jinping shake hands in Hamburg at G20 Summit. Rahul Questioned why Modi Silent on China Issue.

కామెంట్ : మన ప్రధాని ఓ వీక్ పర్సన్?

Posted: 07/08/2017 08:18 AM IST
Modi silence on china border tensions

ఓవైపు 45 ఏళ్ల తర్వాత భారత్, చైనాల మధ్య తీవ్ర ఉద్రిక్తతతో దాదాపు యుద్ధ వాతావరణం నెలకొంది. రెండు దేశాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. చైనా మీడియా అయితే భారత్ మీద ఎప్పుడూ లేనంత విషం చిమ్ముతోంది. అయినా మన ప్రధాని మోదీ మాత్రం మౌనంగా ఉంటున్నాడు. ఎందుకు? ఇదే ప్రశ్న వేస్తున్నాడు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఈ మేరకు తన ట్విట్టర్ లో కామెంట్ చేశాడు.

చైనా విష‌యంలో మ‌న ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర‌ మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారు? అంటూ నిల‌దీశాడు. ఇంతకు ముందు అమెరికా సందర్భంగా ట్రంప్ తో భేటీ అయి హెచ్‌-1 బీ వీసాల గురించి చ‌ర్చించ‌ని మోదీనీ రాహుల్ 'ఓ బ‌ల‌హీన వ్య‌క్తి' గా పేర్కొన్న విష‌యం తెలిసిందే. కనీసం సలావుద్దీన్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన సమయంలో అయినా కశ్మీర్ సమస్యపై నోరు విప్పుతాడని భావించినప్పటికీ అదీ జరగలేదని విమర్శించాడు కూడా.

 

జీ20లో సీన్ రివర్స్...

విరుద్ధంగా, ఊహించని విధంగా భారత్ ను చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ జర్మనీలోని హాంబర్గ్ల్ లో జరుగుతున్న జీ20 భేటీలో ప్రశంసల్లో ముంచెత్తాడు. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటం, ఉగ్రవాదాన్ని అణచివేయడానికి భారత్ చేస్తున్న కృషి చాలా గొప్పదని జిన్ పింగ్ ప్రశంసించారు. బ్రిక్స్ దేశాల సమాఖ్యలో కూడా భారత్ పాత్ర చాలా గొప్పదని కొనియాడారు. ఆర్థిక, సామాజిక రంగాల్లో భారత్ సాధిస్తున్న పురోభివృద్ధి అభినందనీయమని అన్నారు. రానున్న రోజుల్లో భారత్ మరింత అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని ఆకాంక్షించారు.

బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా) దేశాల అధినేతలు ఓ ఇన్ఫార్మల్ మీటింగ్ లో పాల్గొనగా మోదీ, జిన్ పింగ్ లు షేక్ హ్యాండ్ లు ఇచ్చుకుని, ఆప్యాయంగా పలకరించుకున్నారు. సమావేశంలో ఇద్దరూ పక్కపక్కనే ఆసీనులయ్యారు. అంతకు ముందు మోదీ మాట్లాడుతూ, జిన్ పింగ్ ఛైర్మన్ షిప్ లో బ్రిక్స్ నిర్దేశిత లక్ష్యాలను సాధించే దిశగా కొనసాగుతోందని కితాబిచ్చారు. అయితే వీరిద్దరి మధ్య ప్రత్యేక సమావేశం మాత్రం జరగలేదు.

దీనిపై రాజకీయ విశ్లేషకులు మోదీ చాతుర్యం ప్రకటించాడని పేర్కొంటున్నారు. సమావేశంలో మోదీ ముందుగా మాట్లాడి... చైనా సైతం భారత్ ను పొగడక తప్పనిసరి పరిస్థితిని సృష్టించారు. దీనికి తగ్గట్లే చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తన ప్రసంగంలో భారత్ ను.. మోదీ సర్కారును పొగిడేశారు. ఉగ్రవాదంపై భారత్ పోరును పొగిడిన చైనా అధ్యక్షుడు ఆర్థిక.. సామాజిక రంగాల్లోనూ భారత్ అభివృద్ధిని మెచ్చుకోవటం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  PM Modi  China  Xi Jinping  G20 Summit  

Other Articles