UP govt shocking gift to newly married couples కొత్త జంటలకు యోగి సర్కార్ షాకింగ్ గిప్ట్..!

Up government to gift condoms and contraceptives to newly married couples

Uttar Pradesh, UP government, nayi pahal kit, newlyweds, Yogi Adityanath, newly married couple, Mission Parivar Vikas, shagun, condoms, contraceptives

UP government is going to gift condoms to newly married couples in a bid to promote family planning. The scheme has been made under Mission Parivar Vikas

కొత్త జంటలకు యోగి సర్కార్ షాకింగ్ గిప్ట్..!

Posted: 07/07/2017 03:32 PM IST
Up government to gift condoms and contraceptives to newly married couples

కొత్తగా పెళ్లయిన జంటలు అప్పుడప్పుడే శృంగారంలో అత్యంతాలకు చూడాలని కొత్త ప్రపంచంలో విహరిస్తున్న నేపథ్యంలో వారికి జీవితమంటే పోరాటం అన్నట్లుగా హితబోధ చేసేందుకు సిద్దమైంది ఆ రాష్ట్రంలోని యోగి అధిత్యనాథ్ ప్రభుత్వం. సర్వసాధారణంగా కొత్తగా పెళ్లైన జంటలకు ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కానుకలు ఇస్తామంటే.. ఖరీదును పక్కనబెట్టి.. కనీసం విలువైనదైనా ఇస్తారని బావిస్తాం. కానీ యోగీ సర్కార్ మాత్రం ఒక్కసారిగా నూతన జంటలు షాక్ కు గురయ్యే గిఫ్ట్ ప్యాక్ లను ఇచ్చేందుకు రెడీ అయ్యారు.

నిజానికి యోగీ సర్కార్ ఇచ్చే కానుక అత్యంత విలువైనదే కాదు.. పేదవర్గాల ప్రజలకు జీవితం గురించి.. భూమిమీదకొచ్చే ఓ కొత్త ప్రాణం గురించి, వారిని ఎలా పెంచాలన్న విషయమై అవగాహన కల్పించే అత్యంత విలువైన గిప్ట్ ఇవ్వనున్నారు. మిషన్ పరివార్ వికాస్‌లో భాగంగా కొత్తగా పెళ్లయిన జంటలకు కండోమ్ లు, ఇతర గర్భ నిరోదక సాధనాలున్న కిట్లను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. జీవితం గురించి పెళ్లి కాగానే అవగాహన కల్పించాల్సిన అవసరం ప్రభుత్వాలపై వుందని అధికారులు చెబుతున్నారు.

ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జులై 11 నుంచి యోగి ప్రభుత్వం 'నయీ పహల్ కిట్ ఫర్ న్యూలీ వెడ్స్' అనే కిట్లను అందించనుంది. ఆశా కార్యకర్తలు కొత్త జంటలకు ఈ కిట్లను అందించనున్నారు. కండోమ్ లు, గర్భనిరోధక మాత్రలతో పాటు గర్భాధారణ సమయంలో అనుసరించాల్సిన జాగ్రత్తలతో కూడిన సమాచారం, సురక్షిత శృంగారం, కుటుంబ నియంత్రణ, ప్రసవానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిపే చిన్న బుక్‌లెట్‌ను ఈ కిట్‌లో సమకూర్చనుంది. నెయిల్ కట్టర్, అద్దం, దువ్వెన, గర్భనిరోధక మాత్రలు, జంట తువ్వాళ్లు, కర్చీఫ్‌లు ఈ కిట్‌లో ఉండనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles