Samsung reduces prices on TV sets సామ్ సంగ్ టెలివిజన్ ధరలు తగ్గాయోచ్..!

After lg and panasonic hikes prices samsung reduces

Samsung, Panasonic India Private Limited, Panasonic, LG, gst samsung, gst panasonic, gst LG, samsung tv prices reduced, lg tv prices hiked, panasonic tv prices hiked, good and services tax, indian market, consumer durables

Samsung, the country's biggest consumer electronics and white goods company , has reduced prices in the key Mumbai region after imposition of GST.

రూ.10 వేల మేర తగ్గిన సామ్ సంగ్ టీవీలు..

Posted: 07/07/2017 02:28 PM IST
After lg and panasonic hikes prices samsung reduces

ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది కస్టమర్లను అకర్షిస్తూ.. అతిపెద్ద కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజంగా వెలుగొందుతున్న సామ్ సంగ్.. తన వినియోగదారులకు మరో శుభవార్తను అందించింది. జీఎస్టీతో దేశవ్యాప్తంగా ఏకీకృత పన్నువిధానం అమల్లోకి రావడంతో.. ఎల్జీ సంస్థ తన ఉత్పత్తుల ధరలకు రెక్కలు జోడించగా, పానసోనిక్ సంస్థ కూడా తాము కూడా త్వరలోనే ధరలను పెంచుతామని ప్రకటించాయి. అయతే వీటికి భిన్నంగా సామ్ సంగ్ సంస్థ మాత్రం తన ఉత్పత్తులపై ధరలను తగ్గించింది. అయితే ఇది యావత్ దేశ ప్రజలకు వర్తించదని మెలిక కూడా పెట్టింది.

జీఎస్టీ అమలు తర్వాత దేశ అర్థిక రాజధాని ముంబైలో మాత్రమే తన ఉత్పత్తులపై రేట్లను తగ్గిస్తున్నట్టు సామ్ సంగ్‌ ప్రకటించింది. స్పాన్లు‌, టెలివిజన్లు, మైక్రోఓవెన్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మెషిన్లు, ఎయిర్‌ కండీనర్లు వంటి కేటగిరీల్లో ఈ ధరల తగ్గింపు ఉంటుందని సామ్ సంగ్‌ తెలిపింది. కొత్త ధరలపై డీలర్లకు సమాచారం అందించినట్టు కూడా పేర్కొంది. అయితే ఈ కొత్తపన్నుల విధానంలో ఢిల్లీ వంటి ఇతర ప్రధాన నగరాల్లో కూడా ధరలను తగ్గించిందా? లేదా? అన్నది ఇంకా స్పష్టంకాలేదు.

దేశవ్యాప్తంగా ఏకీకృత పన్ను విధానం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో అన్ని దేశంలోని రాష్ట్రాల ప్రజలకు ఈ తగ్గింపును ఎందుకు వర్తింపచేయడం లేదో సంస్థ వర్గాలకే తెలియాలి. అయితే ఈ విషయంపై కంపెనీ అధికార ప్రతినిధి సంప్రదించినా అతను స్పందించడం లేదు. ఓ వైపు సామ్ సంగ్ ప్రధాన ప్రత్యర్థి అయిన ఎల్జీ తన ఎల్‌ఈడీ టీవీలపై ధరలను పెంచగా.. పానాసోనిక్‌ కూడా అదే బాటలో పయనిస్తామని ప్రకటించింది. అయితే సామ్ సంగ్ మాత్రం ధరలను ఎలా తగ్గించిందన్న విషయమై కస్టమర్లలో కన్ఫూజన్ నెలకొంది. కాగా డీలర్లకు అందిన సమాచారం ప్రకారం కొన్ని ఉత్పత్తులపై ఎక్స్చేంజ్‌ ధరలను కూడా అందిస్తున్నట్టు తెలిసింది.

తగ్గిన ధరలు ఎలా వున్నాయో చూద్దామా..

22 అంగుళాల ఎల్ఈడీ టీవీపై 3 శాతం ధర తగ్గింది. పాతధర రూ.13,900- కొత్త ధర రూ.13,500.
32 అంగుళాల ఎల్ఈడీ టీవీపై 8 శాతం ధర తగ్గింది. పాతధర రూ.38,900- కొత్త ధర రూ.35,900
49 అంగుళాల ఎల్ఈడీ టీవీపై 10 శాతం ధర తగ్గింది. పాతధర రూ.94,500- కొత్త ధర రూ.84,900
వీటితో పాటు అన్ని టీవీ మోడళ్లపై ధరలు తగ్గించింది సామ్ సంగ్.

ఏసీ కేటగిరీలో

1-టన్ను స్ప్లిట్ యూనిట్ పాత ధర రూ.31,400 కొత్త ధర రూ.30,300
1.5-టన్ను స్ప్లిట్ యూనిట్ పాత ధర రూ.54,500 కొత్త ధర రూ.51,900
2-టన్ను స్ప్లిట్ యూనిట్ పాత ధర రూ.66,600 కొత్త ధర రూ.66,600

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Samsung  Panasonic  LG  gst  good and services tax  indian market  consumer durables  

Other Articles