cbi court serious on jagan mohan reddy ఇక చాలు.. మళ్లీ ఇలా జరగొద్దు.. జగన్ పై ఫైర్..

Cbi court serious on jagan mohan reddy

cbi court serious on jagan, andhra pradesh opposition leader jagan, cbi court warns jagan, cbi court jagan, cbi court ycp president jagan, hyderabad cbi court, ap leader of opposition, ycp jagan, abscent, cbi court cases, disappropriate assests

hyderabad cbi court warns the andhra pradesh opposition leader jagan mohan reddy on being absent in his case, says it should not be repeated hereafter.

ఇక చాలు.. మళ్లీ ఇలా జరగొద్దు.. జగన్ పై ఫైర్..

Posted: 07/07/2017 01:21 PM IST
Cbi court serious on jagan mohan reddy

హైదరాబాద్ లోని నాంపల్లి సీబిఐ కోర్టు అంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సీరియస్ అయ్యింది. అక్రమంగా ఆస్తులు సంపాదించారన్నకూడబెట్టిన కేసులో జగన్ నిందితుడిగా వుండటంతో ఆ కేసు విచారణకు ఆయన హాజరుకాకపోవడంపై న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. న్యాయస్థానంలో కేసు విచారణ జరుగుతున్న తరుణంలో ఆయన కోర్టుకు హాజరుకాకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. కేసులో నిందితుడైన జగన్.. న్యాయస్థానానికి ఎందుకు హాజరుకాలేదని ఆయన తరపు న్యాయవాదులను ప్రశ్నించింది.

కాగా గుంటూరులో 8, 9 తేదీల్లో వున్న కారణంగా ఆయన న్యాయస్థానానికిహాజరు కాలేకపోయారని జగన్ తరపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. దీంతో మరోమారు ఇలాంటివి పునరావృతం కావద్దని న్యాయస్థానం ఆయన తరపు న్యాయవాదులను హెచ్చరించింది. సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో జగన్ పై అక్రమాస్తులు సమకూర్చకున్నారని పలు అభియోగాలతో న్యాయస్థానంలో కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులకు సంబంధించి.. ఆయన ఇదివరకే ఏఢాది కాలంపాటు జైలు శిక్ష అనుభించి బెయిల్ పై విడుదలైన విషయం పాఠకులకు తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles