set back to ap deputy cm, loses patience warns women చిన్నరాజప్ప చిందులు.. ఆర్బీపట్నంలో చేధు అనుభవం

Set back to ap deputy cm loses patience warns women

set back to ap deputy cm, set back to ap home minister, set back to nimmakayala chinarajappa, nimmakayala chinarajappa loses cool, chinarajappa loses cool, chinarajappa west godavari, chinarajappa warns women, chinarajappa loses patience, chinarajappa ration list.

set back to ap deputy cm, and home minister nimmakayala chinarajappa in west godavari district, after women asked for roads and sanitation he who loses patience and warns of removal of names from ration list.

ITEMVIDEOS: చిన్నరాజప్ప చిందులు.. ఆర్బీపట్నంలో చేధు అనుభవం

Posted: 06/21/2017 02:24 PM IST
Set back to ap deputy cm loses patience warns women

అధికారంలో వున్న వారు అనకువతో మెలుగుతూ.. ప్రజాహిత కార్యక్రమాలను చేపట్టి.. ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారం చేపడితే మరోమారు అధికారంలోకి వస్తారన్నది నిజం. ఇది పలు సందర్భాలలో పలు రాష్ట్రాలలో నిరూపితమైంది కూడా. అయితే మేము అధికారంలో వున్నాము కాబట్టి.. ఏం చేస్తే దానిని శ్లాఘించాలి.. అంటూ ప్రజలకు వార్నింగ్ ఇస్తే.. ఎలా..? అదే జరిగింది. ఇలా చేసింది ఎవరో అధికార పార్టీ నేత కాదు.. కనీసం ఎమ్మెల్యే కూడా కాదు. ఏకంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రే అయితే.. బాధితులు వారి సమస్యలను ఎవరికి చెప్పుకోవాలి.

తూర్పు గోధావరి జిల్లా పెద్దాపురం మండలం రాయభూపాలపట్నం గ్రామంలో రాష్ట్ర డిఫ్యూటీ ముఖ్యమంత్రి, హోంమంత్రి చిన్నరాజప్పకు చేధు అనుభవం ఎదురైంది. ఆభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించేందుకు వచ్చిన ఆయనను మహిళలు చుట్టుముట్టి తమ సమస్యలు పరిష్కారించాలని కోరడంతో.. ఆయన సరే చూద్దామన్నారు. తాము సమస్యల వలయంలో వున్నామని తక్షణం పరిష్కారమయ్యేలా చూడాలని కోరడంతో అక్కడ మంత్రివర్యులకు మహిళలకు మద్య మాటామాటా పెరిగింది.

ఇంతలో అక్కడి నాయకులు ఆయన చెవిలో వీరంతా ప్రతిపక్షానికి మద్దతిచ్చేవారని చెప్పడంతో.. ఆయన రోడ్లు వేస్తున్నాం, రేషన్ ఇస్తున్నాం, అంటూ తమ పార్టీ చేసిన అభివృద్ది పనులను వల్లెవేశారు. అంతటితో అగకుండా మీరు తెలివిగా మాట్లాడకూడదని వారిపై అగ్రహంతో ఊగిపోయారు. ఇలా వారికి మద్దతిస్తే మీకు అందిస్తున్న రేషన్, ఫించన్ నిలిపేస్తాం.. అప్పుడు మీరే రోడ్డున పడతారు అంటూ మహిళలను హెచ్చరించారు. తాము అభివృద్ధి పనులకు వత్తాసు పలకాలంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nimmalayala chinarajappa  AP deputy CM  Home Minister  west godavari  women  

Other Articles