Great Threat to Earth from Asteroid Strikes

Ireland scientist warn earth threat

Asteroid Strikes, Ireland Scientist, Ireland Scientist Warn, Ireland Scientist Threat, Ireland Scientist Alan Fitzsimmons, Earth Danger, Ireland Scientist Warn, Ireland Scientist Asteroid Strikes

Asteroid colliding with Earth very much possible; world should get ready for it, warns Ireland scientist. Alan Fitzsimmons a leading astrophysicist from Queen's University Belfast in Northern Ireland has warned that the world should get ready for an asteroid strike, which is just a matter of time.

వార్నింగ్ : సర్వ నాశనానికి సిద్ధం కండి

Posted: 06/21/2017 04:06 PM IST
Ireland scientist warn earth threat

ప్రపంచం మరో భారీ నాశనానికి సిద్ధం అవుతోందా? ఊహించే ఉపోద్ఘాతమే ఇందుకు కారణం కాబోతుందా? ఐర్లాండ్ కు చెందిన ఓ శాస్త్రవేత్త ఇచ్చిన సంకేతాలు అవుననే అంటున్నాయి. భారీ ఉల్కలు భూమిని ఢీ కొట్టడం, తద్వారా భూమి సర్వనాశనం అవ్వక తప్పదని హెచ్చరిస్తున్నాడు.

ప్రపంచ ప్రఖ్యాత ఆస్ట్రో ఫిజిసిస్ట్ అలాన్ ఫిట్జ్ సిమ్మన్స్ తన పరిశోధనల అనంతరం కమిటీకి ఇచ్చిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించాడు. 1908లో ఒక చిన్న ఉల్క సైబీరియాలోని తుంగుస్కా ప్రాంతాన్ని ఢీకొనడంతో 800 చదరపు మైళ్ల భూభాగం సర్వనాశనం అయింది. ఇప్పుడు అదే తరహా పరిణామం జరిగితే మాత్రం ఓ నగరమే నామ రూపాలు లేకుండా పోతుందని చెబుతున్నాడు. అంతకంటే పెద్ద ఉల్క ఢీ కొంటే మాత్రం ఊహించని రీతిలో నష్టం వాటిల్లుతుందనన్నాడు.

మన శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు ఎంతో కృషి చేసి, భూమికి సమీపంలో ఉన్న, మనకు హాని కలిగించే 1800 ఆస్టరాయిడ్స్ ను గుర్తించారని... అయితే, ఇంకా చాలా వాటిని గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రతిరోజూ మన శాస్త్రవేత్తలు భూమికి దగ్గరగా ఉండే ఉల్కలను గుర్తిస్తూనే ఉంటారని, అయితే వాటి వల్ల హాని ఉండదని తెలిపారు. మరో తుంగుస్కా ఘటన ఏ క్షణంలోనైనా జరిగే అవకాశం ఉందని... అందరూ సిద్ధంగా ఉండాలని హెచ్చిరించారు. ఆ ఘటన కోసం ప్రపంచం మొత్తం సిద్ధం కావాల్సిందేనని హెచ్చరించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Asteroid Strikes  Ireland Scientist  Warn  

Other Articles