Yoga Day elude at Ramdev’s native village in Haryana యోగా డే: బాబా రాందేవ్ సోంతూర్లో మీడియాకు షాక్

World celebrates yoga day but fervour eludes ramdev s native village in haryana

Ramdev, native village, Mahendragarh, Saidalipur, Deshpal Nambardar, International Yoga Day, Haryana

During a visit to Ramdev’s native village in Mahendragarh to take stock of preparations for the grand event, media found that villagers were not even aware of the day commemorated for yoga in 2014.

యోగా డే: బాబా రాందేవ్ సోంతూర్లో మీడియాకు షాక్

Posted: 06/21/2017 04:53 PM IST
World celebrates yoga day but fervour eludes ramdev s native village in haryana

అమ్మకు బోజనం పెట్టని వాడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడన్న నానుడి తెలియని తెలుగువారుండరు. సరిగ్గా అలాగే వుంది ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ పరిస్థితి. తన రాష్ట్రానికి ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నా.. ఆయన పతాంజలి యోగఫీఠం అధ్వర్యంలో హర్యానా రాష్ట్ర వ్యాప్తంగా యోగాభాస్యం చేయిస్తున్నా.. మరోలా చెప్పాలంటే యావత్ ప్రపంచం యోగా డే కోసం పలు ఏర్పాట్లు చేసుకుని దానిని దిగ్విజయంగా ముగించినా.. ఆయన సొంతూర్లో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా వుంది.

ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన స్వగ్రామానికి వెళ్లిన మీడియా షాక్ కు గురికావాల్సి వచ్చింది. యోగా డే రోజున బాబా రాందేవ్ స్వగ్రామంలో అంగరంగవైభవంగా ఏర్పాటు వుంటాయని భావించిన మీడియా విస్మయానికి గురైంది. హర్యానాలోని మహేంద్రఘడ్ ప్రాంత పరిధిలో సైదలిపూర్ గ్రామం బాబా రాందేవ్ స్వగ్రామం. అక్కడ యోగా సంబరాలు కవర్ చేసేందుకు వెళ్లిన మీడియాకు అసలు ఏమాత్రం ఏర్పాటు జరగకపోవడం షాక్ కలిగించింది. అందుకు పలు కారణాలు కూడా వున్నాయి. గ్రామస్థులే కాదు.. చివరకు బాబా రాందేవ్ వదిన కూడా తాను ప్రతి రోజు యోగాను అభ్యసించనని చెప్పారు. తాను ఎప్పడైనా అస్వస్థతకు గురైతే తప్ప యోగా జోలికి వెళ్లనన్నారు. అయితే గ్రామంలో వున్న విలువ గ్రామస్థులకు తెలియడం లేదని అమె వ్యాఖ్యానించారు.

గ్రామంలో నెలకొన్న అంతర్గత రాజకీయాల కారణంగా గ్రామంలో ఎవరూ యోగా చేయరని సైదలిపూర్ గ్రామ సర్పంచ్, రాందేవ్ చిన్ననాటి స్నేహితుడు దేశ్ పాల్ సంబర్ధర్ అన్నారు. తమ గ్రామంలో ఎక్కడా యోగా వేడుకలు నిర్వహిస్తున్న దాఖలాలు కనిపించవని అన్నారు. కొద్దో గోప్పో 20 నుంచి 30 మంది యోగాను అభ్యసిస్తారని అయితే వారు ఇళ్లలో మాత్రమే చేస్తారని అన్నారు. ఇక దీనికి తోడు బాబా రాందేవ్ పై గ్రామస్థులకు వున్న కోపం కూడా మరో కారణంగా తెలుస్తుంది. ఈ విషయాన్ని గ్రామంలోని ఓ మహిళ తన అభిప్రాయపడింది.

బాబా రాందేవ్ హరిద్వార్ కు వలసవెళ్లిన తరువాత.. తన జన్మనిచ్చిన స్వగ్రామానికి ఏదైనా చేయాలని వెళ్లి అడిగిన గ్రామపెద్దలు ఉత్తచేతులతో తిరిగివచ్చారని, దీనికి తోడు గ్రామంలోని నిరుద్యోగ యువత కూడా ఆయన వద్దకు వెళ్లి ఉద్యోగం, ఉపాధి అవకాశాలను అడిగినా.. ఆయన నిద్వందంగా నిరాకరించారని అందుకే అయన పట్ల గ్రామ ప్రజలకు గౌరవం లేదని చెప్పారు. ఇక హరిద్వార్ వెళ్లిన తరువాత బాబా రాందేవ్ పూర్తిగా తమ గ్రామానికి రావడం మానేశారని, యావత్ ప్రపంచాన్ని నెగ్గిన వ్యక్తి సొంత ఊళ్లో మాత్రం విభిన్నమైన పరిస్థితి వుండటంపై విమర్శలు వస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ramdev  native village  Mahendragarh  Saidalipur  Deshpal Nambardar  International Yoga Day  Haryana  

Other Articles