Presidential election: Will there be a contest? రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవంగా జరిగేనా..?

Presidential election will there be a contest

Presidential Elections 2017, Ramnath kovind, Bihar, Pranab Mukherjee, CEC, president, Rashtrapati Bhawan, Rajya sabha, lok sabha, presidential election2017, President Election, election news

An election for President is essential, the Left said today, claiming that "it is a battle of ideologies" - a stand that resonates with the Congress.

రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవంగా జరిగేనా..?

Posted: 06/20/2017 08:47 PM IST
Presidential election will there be a contest

రామ్ నాథ్ కోవింద్ ను ఎన్డీయే తమ రాష్ట్రపతి అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఏకగ్రీవ ఎన్నిక మాత్రం కుదిరేపనిలా లేదు. దీంతో రాష్ట్రపతి ఎన్నికలకు పోటీ తప్పదన్న సంకేతాలను అటు ప్రధాన ప్రతిపక్షం ఇటు వామపక్షాలు సంకేతాలను ఇస్తున్నాయి. దళిత నేతను దేశంలోని అత్యున్నత పదవికి ఎంపిక చేయడమన్నది కాంగ్రెస్ చేసే పనిగా చెప్పుకోచ్చిన ఆ పార్టీ అగ్రనేత గులాంనబీ అజాద్.. ఇది తమ పార్టీ గతంలోనే చేసి చూపిందని.. గతంలో కేఆర్ నారాయణన్ను రాష్ట్రపతిగా చేసిన ఘనత కాంగ్రెస్ దేనని అన్నారు.

గతంలో మాదిరిగా ఈ సారి కూడా బీజేపి తటస్థంగా వుండే వ్యక్తిని నిలబెడుతుందని అశించామని, అయితే ఒక బీజేపి పార్టీ నేతను ఈ పదవికి అభ్యర్థిగా ఎన్డీఏ ప్రకటించిన నేపథ్యంలో తాము బీజేపి నేతకు ఎలా మద్దతునిస్తామని ఆయన ప్రశ్నించారు. గతంలో వాజ్ పాయ్ ప్రధానిగా వున్న హయాంలో అబ్దుల్ కలాంను ప్రతిపాదించగా దానిని తాము కూడా అంగీకరించి మద్దతు పలికిన విషయాన్ని అజాద్ ఊటంకించారు. ఈ సారి కూడా అలాంటి నిర్ణయమే బీజేపి తీసుకుంటుందని భావించామని తెలిపారు.

ఈ క్రమంలో తాము ఈ నెల 22న కలసివచ్చే పార్టీలన్నింటితో మరోమారు భేటీ అయిన తరువాత తమ రాష్ట్రపతి అభ్యర్థిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పుకోచ్చారు. బీజేపి నేతనే అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో ఆయన మద్దుతనివ్వడం కుదరని పని అని అజాద్ చెప్పుకోచ్చారు. ఇదిలావుండగా అటు సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి కూడా రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దీంతో ఇక రాష్ట్రపతి ఎన్నికలకు సమరశంఖం మోగనుందన్న స్పష్టమైన సంకేతాలు వచ్చాయి.  సికాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్. కాంగ్రెస్ ఒక్కపార్టీగా నిర్ణయం తీసుకోదన్నారు. 22నాడు అన్ని పక్షాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సమాజ్ వాదీ, జేడీయూ, ఆర్జేడీ నేతలు కూడా ఇదే అన్నారు.

ఇక బీజేపీ మిత్రపక్షం శివసేన కూడా ఎన్టీఏ రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో మద్దతుపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. దేశానికి మేలు చేసేదైతే మద్దతిస్తామనీ, అంతేగానీ దళిత నాయకుడిని పెట్టడం పార్టీ నిర్ణయం మీద ప్రభావం చూపించదన్నారు శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే. అయితే మహారాష్ట్రలో తమ అటలు సాగనీయకుండా ఎత్తుకు పైఎత్తులు వేస్తూ.. ముందుకుసాగుతున్న అధికారపక్షానికి జలక్ ఇవ్వాలంటే ఈ ఎన్నికలలో ఎన్టీఏ రాష్ట్రపతి ఓట్లు వేయకపోవడమా..? లేక ఓటింగ్ కూ దూరంగా వుంటడమో చేయాలన్న యోచనలో శివసేన వుందని తెలుస్తుంది. దీంతో ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశాలు అనుమానంగానే వున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Presidential Elections 2017  Ramnath kovind  Bihar  Pranab Mukherjee  president  

Other Articles