Assam Tribal Girl filed Case Against Yogi Adityanath

Case against cm over commented on naked photo

Assam Tribal Woman Attack, Tribal Woman UP CM, Yogi Adityanath Case, Laxmi Orang, Laxmi Orang Case, Laxmi Orang Political Entry, Laxmi Orang Yogi Adityanath, Laxmi Orang Anand Sarma, Laxmi Orang Attack Photos, Yogi Comment Laxmi Orang Photo,BJP MP Ram Prasad Sharma

A tribal woman has moved a court here accusing Uttar Pradesh Chief Minister Yogi Adityanath and Assam Lok Sabha MP Ram Prasad Sarma of posting in social media her bare photograph, taken during a stir in Guwahati ten years ago. Laxmi Orang filed the complaint in in the court of sub- divisional judicial magistrate court under various sections of the Indian penal Code and the Information Technology Act.

నగ్న ఫోటోపై కామెంట్.. చిక్కుల్లో సీఎం

Posted: 06/21/2017 08:53 AM IST
Case against cm over commented on naked photo

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ కు కొత్త తలనొప్పి వచ్చిపడింది. తన నగ్న ఫోటోపై కామెంట్ చేయటం పై ఓ గిరిజన మహిళ కోర్టును ఆశ్రయించింది. యోగితోపాటు అస్సాం లోక్ సభ ఎంపీ రాం ప్రసాద్ శర్మ పై కూడా ఆమె ఫిర్యాదు చేసింది.

పదేళ్ల క్రితం క్రితం 24 నవంబర్ 2007న ఆల్ ఆదివాసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆఫ్ అస్సాం ఆందోళన సందర్భంగా కొందరు లక్ష్మీ ఓరంగ్ అనే మహిళను వివస్త్రను చేసి దాడికి పాల్పడ్డారు. జూన్ 13న అసోం లోక్ సభ సభ్యుడు రాం ప్రసాద్ సర్మాలు...తనను వివస్త్రను చేసి వారు కొడుతున్న చిత్రాన్ని ఎలాంటి పోస్ట్ చేశాడు. దానికి యోగి ఆమె బీజేపీ కార్యకర్త అని, దాడి చేసింది కాంగ్రెస్ అంటూ కామెంట్ పెట్టాడు.

దీంతో సదరు మహిళను నగ్న చిత్రాన్ని ఎలాంటి మార్పులు లేకుండా షేర్ చేయటమే కాదు, తన పరువును తీసేశారంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఎలాంటి ఫిల్టర్ వేయకుండా సోషల్ మీడియాలో పోస్టు చేశారని, పైగా తాను ఏ పార్టీకి చెందిన దాన్ని కాదు కనుక తప్పుడు ప్రచారం చేశారంటూ ఆరోపించింది. ఐపీసీ, ఐటీ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద బిస్వనాథ్‌ లోని సబ్‌ డివిజినల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో ఫిర్యాదు చేసింది.

వాంగ్మూలం నమోదు చేసిన మెజిస్ట్రేట్ తదుపరి విచారణను జూన్ 22కు వాయిదా వేశారు.బేటీ బచావో.. బేటీ పడావో అనే ప్రధాని హయాంలో ఇలాంటి నేతలు కూడా ఉన్నారంటూ ఆమె మండిపడింది. దీనిపై శర్మ స్పందిస్తూ బాధితురాలికి న్యాయం జరగాలనే షేర్ చేశాను తప్ప మరెయితర ఉద్దేశం లేదని తెలిపాడు. ఈ మధ్య ఆమె కేసును రీ ఓపెన్ చేయాలని ముఖ్యమంత్రి సర్బనంద సోనోవాల్ ను కోరిందే ఆయన. అలాంటి తనపైనే ఆమె కేసు వేయటంతో న్యాయపరంగానే ఎదుర్కుంటున్నానని శర్మ చెప్పుకొచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Assam  Tribal Woman  Laxmi Orang  Yogi Adityanath  

Other Articles