Woman Picks Up Rattlesnake By Mistake బొమ్మే కదా అని తీసుకోబోయి.. గెంతులేసిన మహిళ

Carla rosso accidentally picks up rattlesnake in california

woman picks up rattlesnake, woman picks up snake, snake video, woman picks up snake video, woman snake video, viral snake video, woman accidentally picks up snake, youtube snake video, California woman, venomous snake, Carla Rosso, Carla Portocarerro Rosso, Ariel, rattlesnake, dogs toy, viral video, video viral, trending, America

A Southern California woman was literally rattled when she picked up what she thought was a dog toy – only to find out it was a venomous snake.

ITEMVIDEOS: బొమ్మే కదా అని తీసుకోబోయి.. గెంతులేసిన మహిళ..

Posted: 06/20/2017 07:17 PM IST
Carla rosso accidentally picks up rattlesnake in california

మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా.. అన్న ఇంద్ర చిత్రంలోని మెగాస్టార్ చిరంజీవి వాడిన పవర్ ఫుల్ డైలాగ్ గుర్తుందా..? ఈ డైలాగ్ గురించి తెలియని వారు, మర్చపోయే వారు ఎవరైనా వుంటారా..? అలాగే చీకట్ల అలుముకున్న వేళ బొమ్మ కదా అని తీయబోయిన ఓ మహిళకు చేధు అనుభవం ఎదురైంది. తమ పెంపుడు శునకాన్ని ఇంట్లోకి తీసుకువెళ్లేందుకు అత్రుతగా వచ్చిన ఓ మహిళ.. దానిని తీసుకువెళ్లడంతో పాటు అప్పటి వరకు అది గేటు ముందు అడుకున్న సమయంలో దాని వస్తువులను కూడా తీసుకుని వెళ్లేందుకు గేటు వద్దకు చేరుకుంది.

గేటు వద్ద వున్న ఓ వస్తువును కూడా శునకం అడుకునే వస్తువుగా భావించి.. ఏకంగా చేత్తోనే దానిని తీసుకునే ప్రయత్నం చేసింది. చేతిలోకి తీసుకునే క్రమంలో ఆ వస్తువు కాస్తా అటు ఇటు కదిలింది. తీరా చూస్తే అది బొ్మ అడుకునే వస్తువు కాదు.. సరికాదా.. విష జంతువు. అదేనండి పాము. అయితే అది కేవలం చిన్న పాము పిల్ల.. అయినా దానిని తాకి భయాంధోళనకు గురైన మహిళ.. తన చేతిలోని పాము పిల్లను పడేసి మరీ  ఏకంగా పరుగులు పెట్టింది. తాను విసిరేసినా.. అది తనపైనే పడిందన్న భావనలో వున్న మహిళ గెంతుతూ తన ఇంట్లోకి పరుగుతీసింది.

ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో ఓ మ‌హిళ.. బొమ్మ అనుకుని పాముపిల్లను ప‌ట్టుకుంది. ఆ స‌మ‌యంలో ఆమె పెంపుడు కుక్క కూడా అక్కడే ఉంది. ఆ మ‌హిళ ప‌రుగులు పెట్టడంతో ఆ కుక్క కూడా ఆమెతో పాటే ప‌రుగులు తీసింది. ‘ఆమె ప‌రుగుతీసిన విధానం ఫ‌న్నీగా ఉన్నా.. తాను పట్టుకున్నది పాముపిల్లని తెలుసుకున్నప్పుడు ఆ మ‌హిళ ఎంత‌గా భ‌య‌ప‌డిపోయిందో’ అని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : California woman  Carla  Ariel  rattlesnake  dogs toy  viral video  

Other Articles