SpiceJet sets up retail venture స్పైస్ స్టయిల్.కామ్ తో ఇ-కామర్స్ లోకి స్పైస్ జెట్

Spicejet enters e commerce retail space with spicestyle

SpiceJet, SpiceStyle, Rohit Bal, E-commerce, Ajay Singh, KrisShop, Amazon.in, E-tail, Retail market, Rs 150 cr revenue, first year, business

Low-cost carrier SpiceJet on Tuesday, has announced entry into ecommerce retail space with the launch of its new retail venture – SpiceStyle.

స్పైస్ స్టయిల్.కామ్ తో ఇ-కామర్స్ లోకి స్పైస్ జెట్

Posted: 06/13/2017 06:06 PM IST
Spicejet enters e commerce retail space with spicestyle

బడ్జెట్ ఎయిర్ కారియర్ స్పైస్‌ జెట్‌ తన వ్యాపార సరళిని మరింత విస్తరించుకునే పనిలో భాగంగా రిటైల్‌ సెగ్మెంట్‌లోకి అడుగుపెడుతుంది. ఇన్నాళ్లు ప్రయాణికులకు డిస్కౌంట్ ఆపర్లతో అకర్షించిన స్పైస్ జెట్ సంస్థ  ఈ కామర్స్‌ వ్యాపారాన్ని ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. తద్వారా భారీ ఆదాయాలపై దృష్టి సారించింది. సుమారు రూ. 15 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు. స్పైస్ స్టయిల్‌.కాం పేరుతో తన రీటైల్‌ పోర్టల్‌ను లాంచ్‌ చేయనున్నట్లు పేర్కొంది.

ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు రిటైల్ వ్యాపారంలో కూడా కస్టమర్లను అకర్షించేందుకు రెడీ అవుతోంది. ఈ కామర్స్ లో ఎంట్రీ ఇచ్చి తొలి సంవత్సరం రూ.150 కోట్ల విలువైన అదనపు ఆదాయాన్ని సమకూర్చుకునే అంశమై దృష్టి సారించినట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. దీని ద్వారా గత రెండు సంవత్సరాల్లో 17 శాతం పెరిగిన స్పైస్‌ జెట్ సహాయక ఆదాయంలో మరో 6 శాతం పెంచుకోవడమే తాము లక్ష్యంగా పెట్టుకున్నామని సంస్థ వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం అమెజాన్.ఇన్ సంస్థతో ఒప్పందాలు కూడా కుదర్చుకున్నట్లు తెలిపాయి.
 
17 వివిధ కేటగిరీలను తాము కస్టమర్లకు పరిచయం చేస్తున్నామని, ముఖ్యంగా ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ రోహిత్‌ బాల్‌ ప్రొడక్ట్స్‌ను అందిస్తున్నామని చెప్పింది. తమ ప్రాడక్టులపై 25 శాతం డిస్కౌంట్లు అందించనున్నట్టు తెలిపింది. ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజంతో భాగస్వామ్యం కుదుర్చుకున్న నేపథ్యంలో వారి సైట్లో కానీ లేదా తమ సైట్ డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు. స్పైస్ స్టయిల్‌.కాం లో కానీ ఆర్డరు చేయవచ్చని స్పైస్‌ జెట్‌ సిఎండి అజయ్ సింగ్ చెప్పారు. ఎందులో తమ ఉత్పత్తులను బుక్ చేసినా.. 25శాతం రాయితి పొందవచ్చునని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SpiceStyle  SpiceJet  Amazon.in  Retail market  E^commerce  business  

Other Articles