Vijay Mallya would be extradited, says VK Singh మాల్యాను భారత్ రప్పించడం ఈజీ కాదు: కేంద్రమంత్రి

Bringing vijay mallya back to india will be difficult says vk singh

CBI, ED, England, External Affairs, fugitive, India, Kingfisher, liquor baron, Vijay Mallya, VK Singh

Union minister VK Singh said that extradition was not a simple issue even as he assured that fugitive liquor baron Vijay Mallya would be brought back to India.

మాల్యాను భారత్ రప్పించడం ఈజీ కాదు: కేంద్రమంత్రి

Posted: 06/13/2017 05:41 PM IST
Bringing vijay mallya back to india will be difficult says vk singh

భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రుణాలను పోంది ఉద్దేశపూర్వకంగా వాటిని ఎగ్గొట్టి లండన్ పారిపోయి మళ్లీ తన జల్సాలకు ఏ మాత్రం ఢోకాలేదని చాటిచెబుతూ.. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ అడుతున్న మ్యాచ్ లకు దర్జాగా వచ్చి వీక్షిస్తున్న అర్థిక నేరస్తుడు, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా విషయంలో కేంద్రం నుంచి అనూహ్యమైన ప్రకటన వెలువడింది. ప్రస్తుతం లండన్ లో ఉంటున్న విజయ్ మాల్యాను భారత్ కు తీసుకురావడం అంత సులువైన విషయం కాదని కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి వీకే సింగ్ అన్నారు.

లండన్ కోర్టులో ఇవాల మాల్యాను వెనక్కు రప్పించే విషయమై విచారణ జరుగతుండగా, అది అంత సులువైన పని కాదని కేంద్రమంత్రి అన్నడంలో అంతర్యమేమిటీ.. ఇది దేనికి సంకేతంగా భావించాలో కూడా భారత ప్రజలకు, అటు బ్యాంకులకు కూడా గోచరించడం లేదు. బ్యాంకులకు అప్పులు ఎగవేయడం ఇతరత్రా ఆరోపణలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఇచ్చిన డాక్యుమెంట్లను బ్రిటన్ కు పంపించామని తెలిపిన కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి వాళ్ల చట్టం పరిమితులు ఇచ్చిన వెంటనే మాల్యాను తీసుకువస్తామని స్పష్టం చేశారు.

మాల్యాను ఎప్పుడు తీసుకువస్తామన్న అంశాన్ని ఇప్పుడే తేల్చలేమని వీకే సింగ్ తెలిపారు. మాల్యా దేశం దాటి వెళ్లిన సందర్భంలో అర్థిక నేరగాళ్ల భరతం పడతామని, ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా.. వారిని వెనక్కు రప్పించి.. చేసిన అప్పులను తీర్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పిన కేంద్రం.. తాజాగా ఇస్తున్న సంకేతాలు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వున్నాయన్న అరోపణలు వినిపిస్తున్నాయి. బ్రిటన్ ఎప్పుడు పర్మిషన్ ఇస్తే అప్పుడే మాల్యాను భారత్ కు తీసుకువస్తామని కేంద్ర మంత్రి వెల్లడించడంలోనే తాత్సార ధోరణి కనబడుతుందన్న విమర్శలు వస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CBI  ED  England  External Affairs  fugitive  India  Kingfisher  liquor baron  Vijay Mallya  VK Singh  

Other Articles