Peace returns to Mandsaur, Shivraj Singh Chouhan ends fast ముఖ్యమంత్రి దీక్షను రైతులు విరమించమన్నారట..

Peace returns to mandsaur shivraj singh chouhan ends fast

Madhya Pradesh Chief Minister Shivraj Singh Chouhan,Mandsaur farmer deaths, shivraj singh indefinite fast, Madhya Pradesh CM, shivraj singh chouhan, peace fast, farmers, indefinite fast, curfew

Madhya Pradesh's Mandsaur, the epicentre of a violent stir by farmers, remained peaceful today, prompting Chief Minister Shivraj Singh Chouhan to end his indefinite fast.

ముఖ్యమంత్రి దీక్షను రైతులు విరమించమన్నారట..

Posted: 06/11/2017 03:16 PM IST
Peace returns to mandsaur shivraj singh chouhan ends fast

తన చేతిలోని పరిపాలన పగ్గాలను వదిలి.. ఏకంగా రైతుల తమ వ్యవహార శైలి మార్చుకుని రాష్ట్రంలో శాంతి నెలకొనేలా పూనుకుంటూనే తాను చేపట్టిన నిరాహార దీక్షను విరమిస్తానని దీక్ష చేపట్టిన మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్ 24 గంటలు కూడా తిరగక్కుండానే తన దీక్షను విరమించారు. భోపాల్ లోని దసరా మైదానంలో తన సతీమణితో కలసి నిరాహార దీక్షకు దిగిన చౌహాన్.. మాండసౌర్ లో రైతులు నిరాహారదీక్ష ముగించమన్నారని చెబుతూ తన దీక్షను అర్థంతరంగా ముగించారు.

మంత్రులు, రైతు సంఘాల నేతలు ముఖ్యమంత్రికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలు పరిష్కరిస్తానని, రైతులపై కాల్పులు జరిపిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కాగా, రుణమాఫీ అమలు చేయాలని, పంటలకు కనీస మద్దతుధర కల్పించాలని చెబుతూ మాండసౌర్ లో రైతులు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు చోటుచేసుకున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Madhya Pradesh CM  shivraj singh chouhan  peace fast  farmers  indefinite fast  curfew  

Other Articles