locals took money from beggar యాచకుడి నుంచి డబ్బు తీసుకున్నపెద్దమనుషులు

Damn the maps social message video goes viral

make a music video, cheap music video, Homeless man gives away money, melbourne homeless man, music video production, socially aware, groundbreaking, homeless man, Damn The Maps, beggar, locals, 99 dollars, music album, melbourne, australia

The locals of australia pulled up money from beggar as he kept a board in front of him on which it was written those who want money they can take it.

ITEMVIDEOS: యాచకుడి నుంచి డబ్బు తీసుకున్న మను(సు)షులు

Posted: 06/09/2017 08:33 PM IST
Damn the maps social message video goes viral

సామాజిక సందేశం ఇస్తామంటే ఎవరూ వినరూ కానీ దానిని వీడియో తీసి నెట్ లె పెడితే మాత్రం అనేక మంది వీక్షిస్తారు. సరిగ్గా అలానే జరిగింది అక్కడ కూడా. ఓ సామాజిక సందేశాన్ని ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో నడుంబిగించిన ఓ పరిశోధన బృందం.. ఓ రద్దీగా వుండే వీధిని ఎంచుకుని మరీ తమ సందేశాన్ని చెప్పాలనుకుంది. సమాజంలో వివిద రకాలైన మనుషులు, వివిధ మనస్థత్వాలు కలిగి వుంటారని రుజువు చేయాలనుకుంది. ఓ బిక్షువు తన వద్దనున్న డబ్బు వద్దని, కావాల్సిన వారు తీసుకెళ్లాలని బోర్డు పెడితే రెండున్నర గంటల్లో డబ్బంతా మాయమైంది.

మ్యాటర్ లోకి ఎంటరైతే..  ఆస్ట్రేలియాలోని మెల్‌ బోర్న్ కి చెందిన ‘డాం ది మాప్స్’ సామాజిక సందేశాన్ని అందించాలన్న ఉద్దేశ్యంతో ఆసక్తికర అంశాన్ని ఎంచుకుంది. ఇ:దుకు గాను గ్రీన్ (39) అనే వ్యక్తికి బిచ్చగాడి వేషం వేయించింది. మొల్ బోర్న్ లోని రద్దీ వీధిలో కూర్చోబెట్టి, అతనికి 100 డాలర్ల చిల్లర నాణేలను ఇచ్చి...ఒక బాక్స్ లో ఉంచింది. అతని ముందు ఒక అట్టపై ‘నా దగ్గరున్న డబ్బు నాకు అవసరం లేదు. కావాలంటే తీసుకోండి’ అని రాసిన బోర్డును ఉంచింది. ఈ తతంగాన్నంతా వీడియోగా చిత్రీకరించింది.

ఆ వీధిలో 2 గంటల 30 నిమిషాల్లో 10,000 మంది అతనిని చూస్తూ, ఆ బోర్డు చదువుతూ వెళ్లిపోయారు. అతని దగ్గర డబ్బులు తీసుకునేందుకు చాలా మంది వెనుకాడగా, కొందరు మాత్రం ఏమాత్రం సిగ్గు లేకుండా డబ్బులు తీసుకెళ్లారు. కొంత మంది అతనికి బిచ్చం వేసే ప్రయత్నం చేశారు. ఒక యువతి డబ్బుకు ప్రాధాన్యత లేదని బాగా చెబుతున్నాని అభినందించి అతనికి కాఫీ కూడా ఇస్తుంది. చాలా మంది అతని ప్రతిపాదనకు, డబ్బు అవసరం లేదని చెప్పడానికి ఆశ్చర్యపోయారు. అయితే ఆ సమయంలో అతని ముందు ఉంచిన 99 డాలర్ల కాయిన్స్ ను ఖాళీ చేసేశారు. మనిషి తీరిది అంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేయగా అంతా ఆసక్తిగా చూస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : homeless man  Damn The Maps  beggar  locals  99 dollars  music album  melbourne  australia  

Other Articles