Idly cooked by using dangerous plastic sheet ప్లాస్టిక్ ఇడ్లీ కలకలం.. తిన్నారో ఫ్రీగా రోగం..!

Dangerous plastic sheet used in cooking idly in chennai

Dangerous idlies, plastic idlies, Plastic Sheet idly, idly cooking process, chennai hotels plastic idly, palstic rice, plastic sugar, plastic sheet, plastic sugar, plastic pulses

Dangerous Plastic Sheet used in cooking process of idly in chennai, After repeated complaints from customers officials raided hotels and recovered plastic sheet

ప్లాస్టిక్ ఇడ్లీ కలకలం.. తిన్నారో వచ్చును రోగం..!

Posted: 06/09/2017 04:59 PM IST
Dangerous plastic sheet used in cooking idly in chennai

హైదరాబాద్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో ప్లాస్టిక్ బియ్యం కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే... ఇంతవరకు పరీక్షల్లో ఈ విషయం నిర్ధారణ కాకపోయినా ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట నుంచి దీనికి సంబంధించిన వార్తలు వస్తున్నాయి. తాజాగా చైన్నైలో మరో కలకలం రేగింది. తమిళులకు ఎంతో ఇష్టమైన సాంబార్ ఇడ్లీ కూడా ప్లాస్టిక్ మయమైపోయిందట. సాంబార్ లో ప్లాస్టిక్ వాడకపోయినా ఇడ్లీల తయారీలో ప్లాస్టిక్ వాడకం బయటపడింది.
    
చెన్నైలోని అన్నానగర్ - తేనాంపేట మండలాల్లోని పలు హోటళ్లపై బుధ - గురువారాల్లో ఆహార భద్రతాశాఖ అధికారులు జరిపిన దాడుల్లో ఈ విషయం బయటపడింది. చెన్నైలో కొన్ని చిన్న - పెద్ద తరహా హోటళ్లలో ఇడ్లీ తయారీలో ప్లాస్టిక్ షీటు ఉపయోగిస్తున్నారంటూ అధికారులకు అనేక ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ దాడులు జరిగాయి. ఈ సందర్భంగా ఆయా హోటళ్లలో 11 కిలోల ప్లాస్టిక్ షీటును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అన్నానగర్ మండలంలోనే 30కి పైగా హోటళ్లను అధికారులు తనిఖీ చేశారు. కొన్ని హోటళ్లలో ఇడ్లీలు ఉడికించే ప్రక్రియలో ప్లాస్టిక్ షీటును వినియోగించడం అధికారుల కంట పడింది. ఆయా హోటళ్ల నుంచి 6 కిలోల ప్లాస్టిక్ పేపర్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
    
తేనాంపేట మండల పరిధిలోని నుంగంబాక్కంలో జరిపిన తనిఖీల్లో 5 కిలోల ప్లాస్టిక్ పేపర్ పట్టుబడింది. నిజానికి ప్లాస్టిక్ పేపర్ తయారీలో కొన్ని రసాయనాలు వినియోగిస్తారని ఇలాంటి పేపర్ పై ఇడ్లీలు ఉడికిస్తే.. ఆ రసాయనాలు ఇడ్లీలలో కూడా కలిసే ప్రమాదముందని అధికారులు చెప్తున్నారు. అయితే.. అధికారులు మాత్రం ఇంత జరిగినా ఆయా హోటళ్ల యజమానులను హెచ్చరించి వదిలేశారంతే. ప్లాస్టిక్ షీట్లపై ఉడికిస్తుండడం ప్రమాదకరమే కానీ ఇడ్లీ తయారు చేసే పిండిలో మాత్రం ప్లాస్టిక్ లేదని అధికారులు తేల్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : plastic idly  plastic sheet  hotel  anna nagar  hotels raid  chennai  

Other Articles