Video Viral: Woman Catches Snake ఒంటిచేత్తో పామును పట్టేసిన పడతి..

Woman catches snake in pillow case like a total boss video gone viral

Woman Catches Snake, american woman catches snake, Video Gone Viral, Viral Video, video viral, Woman, Snake, Pillow Case, North Carolina, America

A Woman video from North Carolina, US, has gone viral after she bravely catches the snake in a pillow case and disposing of it like a total boss.

ITEMVIDEOS: వీడియో వైరల్: ఒంటిచేత్తో పామును పట్టేసిన పడతి..

Posted: 06/09/2017 09:20 PM IST
Woman catches snake in pillow case like a total boss video gone viral

కొంతమంది బల్లులు, బొద్దింకలను చూస్తేనే హడలెత్తిపోతుంటారు. అలాంటిది ఇంట్లోకి పాము వస్తే పైప్రాణం పైనేపోతుంది. పామును పట్టుకోవాలంటే నానా కష్టాలు పడతాం. లేకపోతే పాములను పట్టేవాళ్లను పిలిపిస్తాం. అయితే అమెరికాలోని ఉత్తర కరోలినా ప్రాంతానికి చెందిన ఓ మహిళ మాత్రం ధైర్యంగా ఎటువంటి జంకులేకుండా అలవోకగా పామును ఒడిసిపట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. జూన్‌ 1వ తేదీన పోస్ట్‌ చేసిన ఆ వీడియోను ఇప్పటి వరకు 3.6 మిలియన్ల మంది వీక్షించారు.

తన ఇంటి లోనికి అప్పుడే ప్రవేశించిన పాము.. లివింగ్‌ రూమ్ లోకి ప్రవేశించిన అటూ ఇటూ తిరుగుతుంది. సుమారుగా 5 నుంచి 6 అడుగుల నల్లని పామును టాటూ ఆర్టిస్ట్‌ సన్‌షైన్‌ మెక్యూరీ చూసింది. ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాలేదని, వెంటనే ఇంట్లో ఉన్న దిండు కవర్‌తో పట్టుకోవడానికి ప్రయత్నించానని చెప్పింది. ఎంతో నేర్పుగా పామును ఒడిసిపట్టుకున్న ఆమె.. దానిని బయటకు తీసుకొచ్చి అది ఎంత పొడవు ఉందో కూడా కొలవడం గమనార్హం. తర్వాత ఖాళీ ప్రదేశంలో వదిలిపెట్టడంతో పాము దాని దారిన అది వెళ్లిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Video Gone Viral  Viral Video  video viral  Woman  Snake  Pillow Case  North Carolina  America  

Other Articles