Man Almost Killed After Shooting Fridge Filled With Tannerite వైరల్ వీడియో: సరదా ప్రయోగం.. కొద్దిలో తప్పిన ప్రమాదం..

Man almost killed after shooting fridge filled with tannerite

video viral, Guns, Fridge, Explosions, Tannerite, gun, nerf, nerf war, man lucky to survive, fridge blasted, fridge door rocket speed, viral video

A man who shot a fridge in a forest area, which was filled with tannerite for fun, was lucky to survive as its door came towards him with rocket speed.

ITEMVIDEOS: వైరల్ వీడియో: సరదా ప్రయోగం.. కొద్దిలో తప్పిన ప్రమాదం..

Posted: 06/08/2017 12:12 PM IST
Man almost killed after shooting fridge filled with tannerite

సరదాగా చేసే కొన్ని పనులు ఒక్కోసారి ఊహించని పరిణమాలకు కూడా దారితీస్తాయి. అనూహ్య ఫలితాలను కూడా అందిస్తాయి. ఒక్కోసారి ఈ సరదా పనులు విషాధాన్ని కూడా నింపుతాయి. ఇక మరికొన్ని సందర్బాల్లో ఈ పనులు మరణం అంచుల వరకు తీసుకువెళ్తాయి. హమ్మయ్య బతికిపోయా.. అనో లేక ఇంకా నూకలు మిగిలివున్నాయనో అనుకుని మళ్లీ అలాంటి సరదా ప్రయోగాలకు వెళ్లనీయకుండా చేస్తుంది. ఇక అతి కొద్ది సమయాల్లో మాత్రం సరదా ప్రయోగాలు.. నవ్వులను పూయిస్తాయి.

అయితే ఈ ప్రయోగాలకు పూనుకున్న తరువాత కానీ అవి ఎలా ముగుస్తాయో తెలియదు. కాకపోతే ముందునుంచి కొంత అప్రమత్తత పాటించడం చాలా మంచిది. ఇక్కడ ఓ యువకుడికి సరిగ్గా అలాంటి అనుభవమే ఎదురైంది. సరదాగా ప్రయోగం చేద్దామని వెళ్తే.. అదృష్టం కలిసోచ్చి కొద్దిలో చావు తప్పింది. అయితే తాను చేస్తున్న సరదాను వీడియో దీసి అప్ లోడ్ చేసిన తన స్నేహితులతో శబాష్ అనిపించుకోవలానుకున్న యువకుడికి ఏకంగా అనేక మిశ్రమ స్పందనలు వెల్లువెత్తుతున్నాయి.

మొత్తానికి ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రెండు రోజుల వ్యవధిలోనే 38 వేల మంది దీనిని వీక్షించారు. ఇంతకీ యువకుడు చేసిన సరదా ప్రయోగం ఏంటీ..? అంటారా..? ఫ్రిడ్జ్ లో దాని పేలుడు పదార్థాలతో అటలా..? అంటూ కొందరు కామెంట్లు పెట్టగా.. మరికొందరు యువకుడ్ని సమర్థిస్తూ కామెంట్లు పెడుతున్నారు. నిండా పేలుడు పదార్థాలు ఉంచిన ఓ వ్యక్తి దానిని ఓ నిర్జన ప్రదేశంలో పెట్టి... తాను కొంత దూరంలోని చెట్టు కొమ్మల మధ్యకు వెళ్లి... అక్కడి నుంచి తుపాకీతో దానిని కాల్చాడు. ఆ బుల్లెట్ వెళ్లి ఫ్రిడ్జ్ ను తాకగానే అది పేలిపోయింది.

ఇంతవరకు బాగానే వున్నా విస్పోటనం ధాటికి ఫ్రిడ్జి డోర్ నేరుగా అతనున్న వైపుకి రాకెట్ స్పీడులో దూసుకువచ్చింది. రెప్పపాటులో జరిగిన ఈ పరిణామానికి ఖంగుతిన్న యువకుడు.. షాక్ అయ్యాడు. వేగంగా స్పందించి ఒంగి.. చెట్టు పక్కకు చేరుకున్నాడు. అదృష్టవశాత్తు చెట్టు కొమ్మల మధ్యనుండడంతో బతికిపోయాడు. లేకుంటే అది దూసుకొచ్చిన వేగానికి అతని ప్రాణాలు గాల్లో కలసిపోయేవని నెట్ జనులు కామెంట్లు పెడుతున్నారు. మరి లేటెందుకు మీరూ ఆ వీడియోను చూసేయండీ..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : video viral  Guns  Fridge  Explosions  Tgun  fridge blast  viral video  

Other Articles