To Solve Traffic Problems Flipkart Launches New Contest

Flipkart new idea for traffic troubles

Flipkart, Flipkart Bangalore, Bangalore Demon, Bangalore Traffic Problems, traffic problems Flipkart Idea, Flipkart New Idea, Flipkart Traffic Contest

Flipkart launches Gridlock Hackathon to scout innovative solutions to Bengaluru's traffic woes. An innovation platform to crowdsource innovative, implementable solutions from the tech community and concerned citizens that could help ease perennial traffic problem.

ఫ్లిప్ కార్ట్ ఐడియా.. ట్రాఫిక్ కు చెక్?

Posted: 06/08/2017 12:55 PM IST
Flipkart new idea for traffic troubles

మెట్రో నగరాల్లో డెవలప్ మెంట్ ఎంత ఈజీగా అవుతుందో.. దానికి తగ్గట్లే జనాభా, కాలుష్యం తదితరాలు కూడా అంతే వేగంగా పెరిగిపోతున్నాయి. బెంగళూర్ లాంటి టెక్కీ నగరవాసులకు మాత్రం ట్రాఫిక్ జామ్ అనే నరకం మరింత ఎక్కువే అని చెప్పుకోవాలి. అయితే ఈ చిక్కులకు చెక్ పెట్టేందుకు ఈ కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్ కార్ట్ కొత్త ఫ్లాన్ వేసింది.

ఫ్లిప్ కార్ట్ 10వ వార్షికోత్సవం సందర్భంగా ఓ కొత్త కాంటెస్ట్ ను నిర్వహిస్తోంది. ఎవరైనా సరే ట్రాఫిక్ నియంత్రణకు సరైన సలహా ఇస్తే వారికి భారీ నజరానా ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. జూలై 1వ వరకు ఇది కొనసాగుతుంది. గెలిచిన వారికి 2లక్షల ఫ్లిప్ కార్ట్ ఫ్రీ వౌచర్లను అందజేస్తుంది. వీరితోపాటు సెకండ్, థర్డ్ విన్నర్ లకు లక్ష, యాభై వేల వౌచర్లను ఇస్తుంది. ఇచ్చే సూచనలను జ్యూరీ మెంబర్లకు పంపి, వాటిలో ది బెస్ట్ సలహాకు ఈ బహుమతులను అందజేస్తారు.

అయితే దీనిలో ఫ్లిప్ కార్ట్ స్వార్థపూరిత ప్రయోజనం ఉందని, డెలివరీలో ఆలస్యం పట్ల కస్టమర్లు అసంతృప్తితో ఉండటం మూలంగానే ఇలాంటి ఆలోచనలు చేస్తుందని పలువురు వ్యాఖ్యానిస్తుండగా, అలాంటిదేం లేదని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. తమ చుట్టూ ఉన్న పరిసరాల స్థితి(ట్రాఫిక్, కాలుష్యం) పై నగర వాసులు ఏ ఒక్కరూ సంతోషంగా లేరు. అందుకే ఓ సదుద్దేశ్యంతోనే ఈ ఫ్లాన్ ను రూపొందించాం అని చీఫ్ ఆర్కిటెక్ ఉత్కర్ష్ చెబుతున్నాడు. అయితే ఎంత చేసినా అది అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుంది కదా అన్న ప్రశ్న కూడా ఉద్భవిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Flipkart  Bangalore  Traffic Problems  

Other Articles

Today on Telugu Wishesh