ISIS Sex Slave Survivor Returns to Her Home కామాంధుల పైశాచికాన్ని తలుచుకుని బాధితురాలు కన్నీటి పర్యతం

Isis sex slave survivor demands recognition of yazidi genocide in tearful homecoming

Nadia Murad yazadi activist, Nadia Murad isis sex slave, Nadia Murad returns home, Nadia Murad iraq, Nadia Murad, Yazidi, UN ambassador, ISIS, Islamci State, IS Sex slave, Sinjar, Iraq, yazadi Activist

Nadia Murad made an emotional return to her home village of Kocho in Iraq for the first time since she was kidnapped by Islamic State militants

కామాంధుల పైశాచికాన్ని తలుచుకుని బాధితురాలు కన్నీటి పర్యతం

Posted: 06/03/2017 09:40 AM IST
Isis sex slave survivor demands recognition of yazidi genocide in tearful homecoming

తాను అనుభవించిన నరకయాతన, తనపై ఐసిస్ ఉగ్రవాదులు రోజుల తరబడి జరిపిన పైశాచికాన్ని, లైంగిక హింసకు తాను బలైన విధానాన్ని తలుచుకుని ఇరాక్ కు చెందిన యాజాది మహిళ నదియా మురాద్ కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఆ చేధు జ్ఞాపకాలను తాను మర్చిపోలేనని అన్నారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు తనను బందీలుగా చేసుకుని ఎక్కడైతే అమెను వారి సెక్స్ బానిసగా చేశారో అక్కడికి అమె మూడేళ్ల తరువాత తొలిసారిగా అ ప్రాంతంలో సందర్శించారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైన అమె తన చుట్టూ భద్రాతా సిబ్బంది వున్నా వారి మధ్యనే అమె కన్నీళ్లు పెట్టుకున్నారు.

2014లో అమెను ఐసిస్ ఉగ్రవాదులు సెక్స్ బానిసగా మార్చారు. అమెతో పాటు సుమారు 7 వేల మంది యువతులను వారు బంధీలుగా చేసుకుని వారిపై లైంగిక దాడులకు పాల్పడ్డారు. దీంతో తమను రక్షించాల్సిందిగా ఆమె అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. దీంతో యాజాది మహిళ పోరాట వనితగా అమె పేరు తెచ్చుకుంది. ఐసీస్ ఉగ్రవాదుల నుంచి తప్పించుకుని అక్కడి నుంచి శరణార్థుల క్యాంపుకు వెళ్లి అటునుంచి జర్మనీకి వెళ్లిన అమె.. తొలిసారిగా యాజాది మహిళలు, యువతులు, బాలికలపై జరగుతున్న అకృత్యాలను ఐక్యరాజ్య భద్రాత కౌన్సిల్ ముందుకు తీసుకువచ్చారు.

ప్రస్తుతం ఐక్యరాజ్యసమితిలో యాజిదీలు, శరణార్థులు, మహిళల హక్కులపై పోరాడే న్యాయవాదిగా విధులు నిర్వర్తిస్తున్న నదియా మురాద్, ఇరాక్ లోని తమ యాజాది గ్రామాన్ని, తమ ఇంటిని సందర్శించారు. ఎంతో ఆనందంగా ఉండే తమ జీవితాల్లో మూడేళ్ల క్రితం చోటుచేసుకున్న దురాగతాన్ని అంతర్జాతీయ మీడియాకు వివరించారు. 2014 వేసవిలో మా గ్రామం యాజిదిని ఒక్కసారిగా ఐసిస్ ఉగ్రవాదులు చుట్టుముట్టారు. కొన్ని నిమిషాల్లోనే మగవారు.. ఆడవారు అంటూ వేరు చేశారు. పురుషులందర్నీ మా కళ్లముందే నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేశారని అమె అప్పుడు జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్నారు.

తమను కూడ కాల్చివేస్తారని భావించిన తరుణంలో అందుకు భిన్నంగా వ్యవహరించిన ఐసిస్ .. యువతులందర్నీ ఇరాక్ లోని మొసూల్ తీసుకెళ్లి వేలం వేసి సెక్స్ బానిసలుగా మర్చేశారని కన్నీళ్ల పెట్టుకున్నారు. అప్పటికే వారి తాము అనేక విధాలుగా లైంగిక హింసను చవిచూశామని.. సిరియన్లు, ఇరాకీయులు, ట్యూనిషియన్లు, యూరోపియన్ల కామదాహానికి బలయ్యాము. చీకటి గదుల్లో ఒకరి తరువాత ఒకరుగా మాపై అత్యాచారాలకు పాల్పడేవాళ్లు. నరకం చూపించే వాళ్లు. ఇలా 3 వేలకు ముందికి పైగా యాజాదీ మహిళలను వారు సెక్స్ బానిసలుగా మార్చేశారని నదియా మీడియాకు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nadia Murad  Yazidi  UN ambassador  ISIS  Islamci State  IS Sex slave  Sinjar  Iraq  yazadi Activist  

Other Articles