Indian-origin man killed in London లండన్లో భారత సంతతి వ్యక్తి హత్య.. నజరానా ప్రకటన

Indian origin man dies after being attacked with baseball bat in uk

Indian-origin man killed in London, Indian-origin man killed in UK, Indian-origin man killed by baseball bat, Indian-origin man killed in hayes, Satnam Singh, Hate crime, Scotland Yard, indian origin killed, baseball bat, realtor, builder, crime

An Indian-origin man has been killed in the UK by an unidentified person who attacked him with a baseball bat, Scotland Yard said today as it offered a reward of 10,000 pounds for inputs leading to the accused's arrest.

లండన్లో భారత సంతతి వ్యక్తి హత్య.. పట్టుకుంటే పదివేలు

Posted: 06/03/2017 10:05 AM IST
Indian origin man dies after being attacked with baseball bat in uk

అగ్రరాజ్యం అమెరికాలో జడలు విప్పిన జాతి వివక్ష క్రమంగా అన్ని దేశాలకు విస్తరిస్తుందా..? ఇన్నాళ్లు భారతీయ సంతతి వ్యక్తులు, భారతీయుల మేధస్సును వేనోళ్ల పొగడిన దేశాలు.. ఇప్పడు వివక్షను అక్కున  చేర్చకుంటున్నాయా..? అన్న సందేహాలు కలగక తప్పడం లేదు. అమెరికా, అస్ట్రేలియా తరువాత తాజాగా బ్రిటెన్ లోనూ భారతీయులు జాతి విద్వేషానికి గురవుతున్నారు. భారత సంతతి వ్యక్తిపై జరిగిన దారుణ హత్యే ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది. అయితే నిందితులను మాత్రం ఇప్పటికే సోలీసులు గుర్తించి పట్టుకోవడంలో విఫలమయ్యారు.

వృత్తి రిత్యా రియల్టర్, బిల్డర్ అయిన నలభై ఐదేళ్ల సత్నామ్ సింగ్ తన స్నేహితుడితో కలసి లండన్ నైరుతి ప్రాంతమైన హేయెస్‌లో గత నెల 3న వాకింగ్ చేస్తుండగా కారులో వచ్చిన ఓ అగంతకుడు వారిని అడ్డగించాడు. కారులోంచి దిగుతూనే చేతిలో బేస్ బాల్ బ్యాట్ పటుకుని.. సత్నామ్ సింగ్ పై విచ్ఛక్షణ లేకుండా కొట్టి పరారయ్యాడు. ఈ దాడిలో తలకు బలమైన గాయాలైన సత్నామ్ సింగ్ ను తన స్నేహితుడు హుటాహుటిన అస్పత్రికి తరలించాడు. కాగా చికిత్స పోందుతున్న సత్నామ్ సింగ్ అరోగ్యం మరింత క్షీణించడంతో..ఈ నెల 23న మరణించాడు.

ఈ ఘటనపై స్కాట్ లాండ్ యార్డు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు సాగిస్తున్నా.. అగంతకుడు ముసుగు ధరించి వచ్చాడని దీంతో అతన్ని గుర్తించలేకపోయామని చెబతున్నారు. అయితే సత్నామ్ సింగ్ కుటుంబసభ్యలు నిందితులను పట్టుకోవాలని పోలీసులను డిమాండ్ చేయడంతో.. సత్నామ్ సింగ్ హత్య కేసులో నిందితుడ్ని గుర్తించి.. వారి అచూకీ చెప్పిన వ్యక్తులుకు పది వేల పౌండ్లను (12,870 డాలర్లు. భారతీయ కరెన్సీలో సుమారుగా పది లక్షల రూపాయలు) ఇస్తామని తాజాగా పోలీసులు నజరానా ప్రకటించారు. కాగా, ఇది జాత్యహంకార హత్య కాదని పోలీసులు చెబుతున్నారు. వ్యాపారరంగంలో ప్రత్యర్థులు చేశారా..? లేక మరెవరు ఈ దారుణానికి పాల్పడ్డారన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్టు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Satnam Singh  Hate crime  Scotland Yard  indian origin killed  baseball bat  realtor  builder  crime  

Other Articles

Today on Telugu Wishesh