chandrababu call for nava nirmana deeksha goes empty ‘బాబు’ నవనిర్మాణ దీక్షను వెక్కిరించన ఖాళీ కుర్చీలు..

Locals unable to repond chandrababu call for nava nirmana deeksha

chandrabau call for nava nirmana deeksha, nava nirmana deeksha call goes empty, locals not respond on nava nirmana deeksha call, chandrababu, AP chief minister, nava nirmana deeksha, vijayawada, state bifurfication day

Andhra pradesh chief minister chandra babu naidu call for nava nirmana deeksha goes with empty chairs as locals does'nt respond.

‘బాబు’ నవనిర్మాణ దీక్షను వెక్కిరించన ఖాళీ కుర్చీలు..

Posted: 06/02/2017 07:36 PM IST
Locals unable to repond chandrababu call for nava nirmana deeksha

రాష్ట్ర విభజనతో తమకు అన్యాయం జరిగిందని మరోమారు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నా ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ వాసులు పెద్దగా పట్టించుకోలేదు. రాష్ట్రాభివృద్ది కోసం నవ నిర్మాణ దీక్షను చేపడుతున్నామని, రాష్ట్ర విభజనతో అన్యాయమైపోయిన ఏపీ రాష్ట్ర పునర్‌ నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగుదామని ఆయన ఇచ్చిన పిలుపును ప్రజలు పెద్దగా స్వాగతించలేదు. నవనిర్మాణ దీక్ష పేరుతో విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ వద్ద ఏడు రోజుల పాటు ఈ దీక్షను ప్రారంభించిన సందర్భాంగా రాష్ట్ర విభజన జరిగిన జూన్ 2వ తేదీని  చీకటి దినంగా  అభివర్ణించారు. రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని భావించే ప్రత్యేకహోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీకి  ఒప్పుకున్నానని ఆయన అన్నారు. ప్రత్యేకహోదాలో ఉన్న అన్నింటిని ప్యాకేజీలో ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని చెప్పారు. అయినా ప్రజలు పెద్దగా స్పందించలేదు.

అదేంటి చంద్రబాబు దీక్షకు ప్రజలు నుంచి స్పందన కరువైందా అంటే అవుననే చెప్పక తప్పదు. తాను తలపెట్టిన దీక్ష కోసం జనాల నుంచి అపూర్వ స్పందన వస్తుందని భావించి దీక్షా ప్రాంగణం వద్ద భారీగా కుర్చీలు వేశారు. . కానీ దీక్ష మొదలైనప్పటికీ...జనం నుంచి స్పందన రాలేదు. దీంతో సభా వేదిక వద్దకు వచ్చిన కొందరి కన్నా వేయించిన ఖాలీ కుర్చీలు అధికంగా కనిపించాయి. ప్రజలు ఆశించిన స్థాయిలో రాకపోవడానికి కారణం ఒకటి జరిగిపోయిన రాష్ట్ర విభజన అయితే మరోకటి ఎండ.

షమియానాలు ఏర్పాటు చేసి వాటి కింద కుర్చీలు వేసివుంటూ టీడీపీ అంచనా మేరకు ప్రజలు వచ్చే వారేమె కానీ.. ఎండకు తట్టుకోలేక ప్రజలు అసలు ఇళ్లలోంచి బయటకు వచ్చేందుకే జంకుతున్నారు. ఇక వచ్చినవారిలో కూడా అనే్క మంది మహిళలు ఎండ వేడిమి తట్టుకోలేక వెళ్లిపోయారు. దీనికితోడు చంద్రబాబు ప్రసంగం దాదాపు గంటన్నర సేపు సాగడంతో వచ్చిన వారికి ఏం చేయాలో తెలియక, ఎండకు తట్టుకోలేక అక్కడి నుంచి వెనుదిరిగారు. దీంతో ప్రతిజ్ఞ, ప్రసంగ సమయంలో కుర్చీలన్నీ ఖాళీగా కనిపించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles