Vodafone offers unlimited calls and 4G data at Rs 19 జియోతో పోటీకి సై అంటున్న వోడాఫోన్

Vodafone offers unlimited calls and 4g data at rs 19

Vodafone, 4G data, Vodafone 4G, Unlimited calls, Red Shield, Vodafone, Red Shield, 4G data, Unlimited calls, Red Shield Vodafone, Red plan, Free 4G data, free calls

Vodafone is now offering data and calls plan that will cost as low as Rs 19. It has also launched Vodafone Red Shield that offers protection against theft, liquid damage and accidental damage for a year by paying 720 a year or Rs 60/month.

జియోతో పోటీకి సై అంటున్న వోడాఫోన్.. రూ.19కే 4జీ డేటా..

Posted: 06/02/2017 03:11 PM IST
Vodafone offers unlimited calls and 4g data at rs 19

టెలికాం రంగంలో జియోను తట్టుకునేందుకు పలు టెలికాం సంస్థలు ఆఫర్ల బాట పట్టాయి. ఇప్పటికే అనేక సంస్థలు చౌకధరల్లో డేటాను అందిస్తుండగా.. తాజాగా వొడాఫోన్‌ కూడా ఈ జాబితాలో చేరింది. ఇక జియోతో యుద్దానికి రెడీ అన్నట్లుగా రమారమి అవే ధరలలో కొత్త పథకానలు ప్రవేశపెట్టింది. తాజాగా ప్రవేశపెట్టిన పథకంలో సూపర్ డే, సూపర్ వీక్ పథకాలు జియోకు పోటీగా నిలుస్తున్నాయి. కేవలం రూ.19 ప్రారంభ ధరతో ఉచిత కాల్స్‌, 4జీ డేటాను అందిస్తూ వోడాఫోన్ సరికొత్త ఆఫర్ ను తీసుకొచ్చింది. అయితే ఈ అవకాశం కేవలం ప్రీ పెయిడ్‌ యూజర్లకు మాత్రమే అందిస్తున్నట్లు వొడాఫోన్‌ తెలిపింది.

వొడాఫోన్‌ సూపర్‌ డే ఆఫర్‌ ప్రకారం.. రూ. 19తో రీఛార్జ్‌ చేస్తే అపరిమిత లోకల్‌, ఎస్‌టీడీ కాల్స్‌ ఉచితంగా చేసుకోవచ్చు. దీంతో పాటు 100ఎంబీ 4జీ డేటాను కూడా అందిస్తోంది. ఇక సూపర్‌ వీక్‌ ఆఫర్‌ కింద రూ. 49తో రీఛార్జ్‌ చేసుకుంటే.. అపరిమిత లోకల్‌, ఎస్‌టీడీ కాల్స్‌తో పాటు 250ఎంబీ 4జీ డేటాను ఇస్తున్నట్లు వొడాఫోన్‌ తెలిపింది. జియోలోనూ రూ. 19 ప్రారంభ ధరతో డేటా ఆఫర్‌లు ఉన్న విషయం తెలిసిందే.  ప్రీపెయిడ్‌ యూజర్లకు ఇది లాభదాయకంగా ఉంటుందని సంస్థ చెబుతోంది.

ఇక వీటితో పాటు రెడ్ షీల్డ్ అన్న పేరుతో మరో పథకాన్ని కూడీ వోడాఫోన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పథకంలో భాగంగా మీ స్మార్ట్ ఫోన్ దొంగలించబడినా.. లేక డిస్ ప్లే స్ర్కీన్ పోయినా, లేక ప్రమాదానికి గురై పాడైనా.. ఈ రెడ్ షీల్డ్ పథకంలో చేరిన కస్టమర్లకు తమ డాటాను అందిస్తుంది. అందుకోసం వోడాఫోన్ కస్టమర్లు ఏడాదికి గాను 720 రూపాయలను చెల్లించాల్సి వుంటుంది. అలాకాని పక్షంలో నెలకు 60 రూపాయల చోప్పున చెల్లించాల్సి వుంటుందని వోడాఫోన్ వర్గాలు తెలిపాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Reliance Jio  Vodafone  4G data  Unlimited calls  Red Shield  Technology  

Other Articles