IRCTC ‘buy tickets now and pay later’ service soon ఇప్పుడు ప్రయాణించండి.. తరువాత చెల్లించండీ..

Irctc to introduce buy tickets now and pay later service soon

IRCTC, Indian Railways, ePayLater, IRCTC facility, book now pay later, train tickets, Mumbai-based firm ePayLater, service charge, e-tickets, name, email ID, mobile number, PAN card, Aadhaar card, one-time password

The Indian Railways Catering and Tourism Corporation will soon launch a new service – ‘buy tickets now and pay later’, IANS reported on Thursday. The facility will allow passengers to buy tickets for all Express trains from the IRCTC website and pay later.

రైల్వే కొత్త సౌలభ్యం: ఇప్పుడు ప్రయాణించండి.. తరువాత చెల్లించండీ..

Posted: 06/01/2017 07:02 PM IST
Irctc to introduce buy tickets now and pay later service soon

భారతీయ రైల్వే సరికొత్త సదుపాయాన్ని తమ ప్రయాణికులు కల్పించేందుకు కసరత్తు చేస్తుంది. ఇప్పటికే రైలులో బోజనం సహా ఇతర క్రీయాశీలక సమస్యలపై దృష్టి సారింది.. వాటిని వేగవంతంగా పరిష్కరించిన రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు.. త్వరలో సరికొత్త సౌలభ్యాన్ని కూడా కల్పించేందుకు సంకల్పించారు. రైల్వే బోగీలలో ఒంటిరిగా ప్రయాణిస్తున్న మహిళలపై కీచకులు వెధింపులకు గురిచేసినా.. లేక తమ బిడ్డలకు పాలు కావాలన్న తల్లి అవేదనను అర్థం చేసుకున్న మంత్రి సకాలంలో అధికారులను స్పందింపజేసి.. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్యాబినెట్ లో అత్యత్తమ మంత్రిగా ఖ్యాతిని పొందారు.

తాజాగా ఆయన నేతృత్వంలోని రైల్వే శాఖ అన్ లైన్ ప్రయాణికులకు మాత్రం కొంత వెసలు బాటు కల్పించేందుకు కూడా సిద్దమైంది. అదేంటంటే ఇప్పుడు ప్రయాణించండీ.. 14 రోజులు (రెండు వారాల్లో) డబ్బును చె్లించండీ అనే కొత్త సదుపాయాన్ని కల్పించనున్నారు. ఈ మేరకు ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ త్వరలోనే ఈ సర్వీసును అందుబాటులోకి తీసుకురానుంది. ఈ సదుపాయం ద్వారా టిక్కటెల్ బుక్ చేసుకునే వారు వారి పేరు, ఈ మెయిల్, మొబైల్ నెంబరు, అధార్ కార్డు వివరాలు, పాన్ కార్డు వివరాలను తెలపాల్సి వుంటుంది.

దీంతో పాటు రైల్వే వెబ్ సైట్ ఇచ్చే వన్ టైం పాస్ వర్డ్ ను కూడా పరిగణలోకి తీసుకుని దాని అనుసంధానంతో టిక్కెట్లను బుక్ చేసుకోవాలి. అయితే ఈ సౌలభ్యం పోందగొరే ప్రయాణికులు 14 రోజుల వ్యవధి లోపు 3.5 శాతం సర్వీసు చార్జితో డబ్బు మొత్తాన్ని చెల్లించాల్సి వుంటుందని ఐఆర్ సిటీసీ అధికార ప్రతినిధి సందీఫ్ దత్తా తెలిపారు. ఇందుకోసం తాము ముంబైకి చెందిన ఈపే లేటర్ సంస్థతో టైఅప్ అయ్యామని చెప్పారు. దీనిని వినియోగించుకునే ప్రయాణికులు కేవలం ఐదు రోజుల ముందు మాత్రమే తమ టిక్కెట్లను బుక్ చేసుకోవాల్సి వుంటుందని కూడా తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IRCTC  Indian Railways  ePayLater  IRCTC facility  book now pay later  train tickets  

Other Articles