Microsoft To Pay Users If They Search With Bing భల్ భలే ఆఫర్: బింగ్ తో కాసులు అందుకోండీ..

Microsoft to pay users if they search with bing

Microsoft to pay net surfers, Microsoft bing search engine, Microsoft competitors, Microsoft google search engine, Microsoft, Google Search, bing, search engine, earn points, britain, France, Germany, Canada

In a push to make people switch to its Bing search engine, Microsoft will now pay users in Britain to use Bing over competitors like Google Search.

భల్ భలే ఆఫర్: బింగ్ తో అన్వేషించండీ.. కాసులు అందుకోండీ..

Posted: 06/01/2017 06:06 PM IST
Microsoft to pay users if they search with bing

బింగ్ గుర్తుందా..? గూగుల్ తరహాలోనే ఇదో సర్చ్ ఇంజన్. అయితే ఇది గూగుల్ అంతగా ప్రాచుర్యం పోందకపోవడంతో.. దీనిని ఎలాగైనా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సాఫ్ట్ వేర్ దిగ్గజ సంస్థ మైక్రో సాఫ్ట్ తీవ్రంగా శ్రమిస్తుంది. అందుకు గాను నెట్ జనులకు ఇది కాసులను కూడా ఇచ్చేందుకు రెడీ అయ్యింది. అవునండీ నమ్మశక్యంగా లేదా..? కానీ ఇది ముమ్మాటికీ నిజం. ఇకపై తమ బింగ్ సర్చ్ ఇంజన్ తో నెట్ లో సర్చ్ చ చేసే వారికి రివార్డ్ స్కీం ను అందించనుంది.

ఈ రివార్డు స్కీం ప్రకారం గూగుల్ బదులు ఇకపై తమ బింగ్ సర్చ్ ఇంజన్ వాడే వారికి రివార్డు పాయింట్లను ఇవ్వనుంది. ఈ మేరకు మైక్రోసాప్ట్ ప్రకటించింది. తమ బింగ్ సర్చ్ ఇంజన్ ను వినియోగించుకుని అన్ లైన్ లో కొనుగోళ్లు చేసినా.. లేక అన్వేషణ సాగించినా, లేక మ్యూజిక్, చిత్రాలకు సంబంధించిన సమాచారాన్ని పోందలానుకున్నా వారందరికీ రివార్డులను అందించనున్నట్లు పేర్కోంది. దీంతో ఇప్పటికే తమకున్న కస్టమర్లను సంఖ్య మరింత పెంచుకోవాలని మైక్రోసాప్ట్ ప్రయత్నాలను ప్రారంభించింది.

ఈ రివార్డు స్కీంలో రెండు లెవల్స్ ద్వారా రివార్డులను అందించనుంది. లెవన్ 1 ప్రకారం రోజుకు పది అన్వేషణలు సాగించిన వారికి కొన్ని పాయింట్లను అందించనుండగా, అదే క్రమంలో లెవన్ 2 ప్రకారం రోజుకు 50 అన్వేషణలు సాగించాల్సి వుంది. తొలి లెవన్ ను పూర్తి చేసుకున్న తరువాత రెండో లెవల్ లోకి వెళ్లగానే రోజుకు 50 అన్వేషణలు సాగించాల్సి వుంటుంది. ఇది ప్రతి రోజు చేస్తేనే రివార్డులు అందుతాయి. తొందరపడి బింగ్ సర్చ్ ఇంజన్ ను డౌన్ లోడ్ చేసుకోకండి.. ఎందుకంటే ఇది కేవలం బ్రిటన్ వాసులు మాత్రమే. త్వరలో ఫ్రాన్సు, జర్మనీ, కెనడా సహా పలు దేశాలకు కూడా దీనిని విస్తరిస్తామని మైక్రోసాప్ట్ అధికారులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Microsoft  Google Search  bing  search engine  earn points britain  France  Germany  Canada  

Other Articles