frog swallowed snake in Andhra pradesh సీన్ రివర్స్.. పామును గుటకాయ స్వాహా చేసిన కప్ప

Scene reverse frog swallowed snake in andhra pradesh

frog swallowed snake, reverse scene of biological life cycle, reverse scene frog swallowed snake, frog, life cycle, biological life cycle, snake, kaikaluru, andhra pradesh

In a reverse scene of the life cycle, the frog swallowed snake in kaikaluru of andhra pradesh

సీన్ రివర్స్.. పామును గుటకాయ స్వాహా చేసిన కప్ప

Posted: 06/02/2017 09:22 AM IST
Scene reverse frog swallowed snake in andhra pradesh

మృగరాజు సింహం గుహలోకి వెళ్లిన మేక దానిని బెదిరించి, బయపెట్టి గుహలోంచి బయటకు వచ్చిన కథను చిన్నప్పడు అందరం చదువుకున్నా. అయితే ధైర్యం వుంటే ఎంతటి పెద్ద ఉపద్రవానైనా ఎదురించగమన్న సందేశాన్ని ఇచ్చే కథ ఇది. దీంతో కష్టాలు, సమస్యలు ఎదురైనప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలే తప్ప.. నీరసించి, కృంగిపోకూడదన్న సందేశం ఇచ్చే ఈ కథతో అనేక మంది ప్రేరణ పోందారు కూడా. అయితే సకలచరచార సృష్టిలో ప్రకృతి ధర్మానికి భిన్నంగా జరిగే ఏ చర్య అయినా అది వార్తగా నిలుస్తుంది. వింత ఘటన అనిపించుకుంటుంది.

తాజాగా అలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ లోని కైకలూరులో చోటుచేసుకుంది. కప్పలను పాములు మింగడం ప్రకృతి ధర్మం. అవే వాటికి జీవనాధారం. అయితే ఈ సహజధర్మానికి భిన్నంగా ఓ ఘటన చోటుచేసుకుంది. తనను మింగడానికి కాచుకుకూర్చున్న పామునే కప్ప మింగితే.. అది విచిత్రం. అదే కైకలూరులో జరిగింది. కృష్ణాజిల్లా కైకలూరు మండలం గోపవరం గ్రామంలో చోటుచేసుకుంది. పంటకాల్వలో తనను మింగేయడానికి ప్రయత్నించిన బురద పామును ఓ కప్ప గుటకాయ స్వాహా చేసింది. గట్టిగా ఒడిసిపట్టిన కప్ప నుంచి తప్పించుకోలేక పాము విలవిల్లాడింది. ఈ పోరాటంలో అంతిమంగా కప్ప విజయం సాధించి పామును పూర్తిగా మింగి నీటిలోకి జారుకుంది. ఈ అరుదైన ఘటనను పలువురు వింతగా తిలకించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : frog  life cycle  biological life cycle  snake  kaikaluru  andhra pradesh  

Other Articles