Jealous Qatari husband glues wife’s genitals వీడోరకం వాడోరకం: సతి శీలానికి తాళం వేసిన శాడిస్టు పతి..

Jealous qatari husband glues wife s genitals

husband glues wife’s genitals, Qatari husband wife genitals, Qatari court, facebook, husband, wife, genitals, crazy glue, qatar, doha, emergency, 100 lashes, 40 riyals, business trip abroad, business trip abroad, adulterous ideas, Judge Muhammad Bin Saden, Qatari court of Justice, viral news

Qatari court fined a husband only 40 Riyal ($10) for sealing his wife’s genitals with crazy glue, but ordered the wife to be lashed 100 times.

వీడోరకం వాడోరకం: సతి శీలానికి తాళం వేసిన శాడిస్టు పతి..

Posted: 06/01/2017 05:29 PM IST
Jealous qatari husband glues wife s genitals

అవును శీర్షక చూడగానే ఇదేదో రీసెంట్ గా వచ్చిన సినిమా టైటిల్ లా వుందని అనుకుంటున్నారు కదూ.. అవును కానీ మిగిలిన శీర్షక కూడా చదివారా..? అదే మిమల్ని అట్రాక్ట్ చేసిందా..? అవునండీ నిజమే.. ఓ శాడిస్టు భర్త తన భార్య శీలానికి తాళం వేయాలని భావించి పిచ్చి ప్రయత్నాలు చేస్తే.. దానిని అంతకన్న పిచ్చిగా ఓ న్యాయమూర్తి సమర్థించారు. అంతేకాదు భర్త చేసిన పనులను షరియా న్యాయశాస్త్రాల ప్రకారం కరెక్టేనని అన్నారు.

అయితే తప్పుడు విధానంతో సతిని ఇబ్బంది పెట్టినందుకు గానే 40 రియాల్స్ జరిమానాగా విధించారు. ఇదిలావుంటే భర్త చేసిన పనితో అత్యవసరంగా అస్పత్రి పాలై.. వైద్య చికిత్సలు పోందుతున్న భార్యకు న్యాయమూర్తి ఏకంగా 100 కోరడా దెబ్బలను శిక్షగా విధించాడు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఖతార్ లోని దోహాకు చెందిన వ్యక్తి తన భార్యపై అనుమానం కలిగింది. ఇక అదే సమయంలో తన 12 ఏళ్ల కజిన్ సోదరుడు తన ఫేస్ బుక్ లో పెట్టిన ఓ పోస్టుకు అమె లైక్ చేసింది. ఇదే ఆ శాడిస్టు భర్తలో అనుమానాన్ని రగిలించింది.

కకాతాళీయంగా అదే సమయంలో అమె బిజినెస్ ట్రిప్ పై విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది. దీంతో విషయాన్ని భర్తకు చెప్పి అనుమతి తీసుకుంది. అందుకు సరేనన్న భర్త.. అమెను రహస్య అంగాలలో ఒక రకమైన గమ్ ను పోసి సీల్ వేయాలని ప్రయత్నించాడు. దాంతో తీవ్రమైన నోప్పితో అమె అస్పత్రి పాలైంది. భర్త చేసిన చేష్టల వల్ల ఇబ్బంది పడుతున్న అమె.. ఏకంగా అంగలార్చుతూ న్యాయస్థానాన్ని అశ్రయించింది. దోహాలోని ఖతార్ కోర్టు జస్టిస్ మహమ్మద్ బిన్ సాడెన్ భర్త చర్యలను సమర్థించారు. అయితే అమెకు ఇబ్బంది కలిగేలా తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నందుకు గానే 40 రియాల్స్ జరిమానా విధించి.. భార్య ఫేస్ బుక్ లో లైక్ చేసినందుకు గానే 100 కొరడా దెబ్బలను శిక్షగా విధించారు. దీంతో విషయం తెలిసిన నెట్ జనులు భర్తే ఓ రకం అనుకుంటే.. జడ్జీ మరో రకమని తేల్చిచెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : viral news  husband  wife  court  punishment  business trip  doha  qatar  facebook  

Other Articles