unmanned locos turn rogue in Tiruchy చుక్ చుక్ రైలు వచ్చింది.. పక్కకు పక్కకు జరగండీ..

Unmanned locos turn rogue in tiruchy run on for over 10 km

Tiruchy junction, unmanned locos, locos jumped signals, erode, breaks, dissel rail, muthuarasanallur, ernakulam-karaikkal express, UK Reddy, fort railway station, divisional railway manager

High drama played out at the Tiruchy junction after two locos jumped signal due to a snag and travelled unmanned for over 10 kilometres before coming to a halt.

చుక్ చుక్ రైలు వచ్చింది.. పక్కకు పక్కకు జరగండీ..

Posted: 06/01/2017 04:39 PM IST
Unmanned locos turn rogue in tiruchy run on for over 10 km

చుక్ చుక్ రైలు వస్తుంది.. పక్కకు పక్కకు జరగండీ.. అన్న శీర్షక చూడగానే చిన్నప్పుడు చదువుకున్న పద్యం గుర్తుకోస్తుందా..? అవునండీ.. అయితే అక్కడ పక్కకు జరగమనింది ఎక్కడానికో.. దిగడానికో.. కానీ తమిళనాడులో వచ్చిన రైలు నుంచి మాత్రం తప్పకుండా పక్కకు జరగాల్సిందే. ఎందుకు..? ఎక్కడానికేగా..? అంటారా.. కాదండీ.. ఈ రైలు మార్గంలోంచి పక్కకు తప్పుకోకపోతే.. ఇక అంతే సంగతులు. ఎందుకని విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారా..? ఏం లేదండీ.. ఈ రైలులో డ్రైవర్ లేడు కాబట్టి. ఔనా..? ఇదేలా సాధ్యం అంటున్నారా..? అయితే డీటైల్స్ లోకి వెళ్లాల్సిందే..

మరమ్మతులకు గురైన ఓ రైలు ఇంజన్ను తిరుచ్చి జంక్షన్ రైల్వేస్టేషన్ నుంచి ఈరోడు స్టేషన్కు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 6.40 గంటలకు రైల్వేస్టేషన్ ఒకటో నంబరు ప్లాట్ ఫారంపై నుంచి మరొక ఇంజన్ తో టైఅఫ్ చేసి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఇంతలో రైలు ఇంజన్ డ్రైవర్ కూడా ఫ్లాట్ ఫాంపైకి దిగి.. నిలబడి చూస్తున్నాడు. ఇంతలో పాడైన రైలు ఇంజిన్‌ అకస్మాత్తుగా దానంతట అదే స్టార్ట్ అయ్యి ముందుకు కదిలింది. దీంతో కంగారుపడిన డ్రైవర్ షాక్ కు గురై వెంటనే తేరుకుని చూసే లోగా.. అది కాస్తా పట్టాలపై వెళ్లిపోతుంది.

ఏం జరుగుతుంతోనని దిగ్భ్రాంతికి గురైన ఇంజిన్‌ డ్రైవరు సంబంధిత అధికారులకు సమాచారం చేరవేశారు. ఫోర్ట్‌ రైల్వేస్టేషన్‌లో ఆ ఇంజిన్‌ను నిలిపేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో కరూర్ బైపాస్ వంతెన దాటి ముత్తరసనల్లూర్ వైపు వెళుతున్న ఇంజిన్ను లూప్‌ లైన్ లోకి దారిమళ్లించి నిలిపివేశారు. సుమారు పది కిలోమీటర్ల దూరం డ్రైవరు లేకుండానే ఇంజిన్‌ నడిచింది. అయితే అకస్మాత్తుగా అది ముందుకు పరుగులు తీసిందని కొందరు చెబుతున్నారు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : unmanned train  tiruchy  erode station  break failure  uk reddy  railway officials  

Other Articles