high court serious on police in yadadri love couple case పరువు హత్యలు పెరిగిపోతుంటే.. మీరేం చేస్తున్నారు..?

High court serious on police in yadadri love couple case

yadadri love couple, swathi-naresh, police, high court, police, honour killings, Telangana, crime

High court serious on telangana police department in yadadri love couple case, asks what is department doing when murders are done in honour killing case.

తెలంగాణ పోలీసులను నిలదీసిన రాష్ట్రోన్నత న్యాయస్థానం..

Posted: 06/01/2017 03:07 PM IST
High court serious on police in yadadri love couple case

యాదాద్రి ప్రేమజంట కేసులో పరువు హత్య నమోదు చేసుకోవడంతో రాష్ట్రోన్నత న్యాయస్థానం తెలంగాణ పోలీసులను నిలదీసింది. పరువు హత్యలు అధికంగా జరుగుతున్నా మీరేం చేస్తున్నారంటూ.. మండిపడింది. పరువు హత్యల విషయంలో పోలీసులు నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా ఎండగట్టింది. పరువు హత్యల వ్యవహారంలో పోలీసులు మోజారిటీ ప్రజల పక్షాన ఎందుకు నిలబడలేకపోతున్నారని నిలదీసింది. పరువు కోసం ఇతరుల కన్నబిడ్డలను దారుణంగా చంపే హక్కు ఎవరీకీ లేదని న్యాయస్థానం అభిప్రాయపడింది.

నరేష్‌ ఆచూకీ తెలుపాలంటూ అతని తల్లిదండ్రులు హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ను దాఖలు చేయడంతో.. ఈ పిటీషన్ పై విచారణన ముగించిన న్యాయస్థానం పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు దర్యాప్తులో ఏమైనా అనుమానాలుంటే తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చునని నరేశ్‌ తల్లిదండ్రులకు హైకోర్టు సూచించింది. ఆ తరువాత సంచలనం రేసిన ఈ కేసులో తెలంగాణ పోలీసులు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. అందులో పలు అసక్తికర విషయాలను వెల్లడించారు.

నరేష్‌ను స్వాతి తండ్రి శ్రీనివాస్‌రెడ్డే హత్య చేశాడని తమ దర్యాప్తులో తేలిందని, హత్యానంతరం ఆధారాలు మాయం చేశాడని, చివరికి నరేష్ అస్థికలను కూడా మూసీ నదిలో కలిపాడు. ఆ తర్వాత స్వాతి ఆత్మహత్య చేసుకుందని పేర్కోన్నారు. నరేష్‌ హత్యపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుపుతున్నమన్న పోలీసులు ఈ కేసులో ప్రాథమికంగా.నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకున్నామని న్యాయస్తానానికి తెలిపింది. ఆత్మకూరు ఎస్సైను సస్పెండ్‌ చేశామని కూడా పోలీసులు హైకోర్టు సమర్పించిన నివేధికలో పేర్కోన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : yadadri love couple  swathi-naresh  police  high court  police  honour killings  Telangana  crime  

Other Articles