Brazil man rode his brother's coffin around on a bike చనిపోయిన సోదరుడు బైక్ పై తిప్పమన్నాడని..

Brazil man rode his brother s coffin around on a bike

Brazil, man, Elderlandes Rosa, Eri Erisberto, rode, dead brother, coffin, bike, Prata, in southeast Brazil, police, sentence,

Elderlandes Rosa, told police he had dreamed that his brother Eri Erisberto, who died more than a year ago, had asked him to go with him for a ride like they used to when he was alive.

చనిపోయిన సోదరుడు బైక్ పై తిప్పమన్నాడని..

Posted: 06/01/2017 01:20 PM IST
Brazil man rode his brother s coffin around on a bike

చనిపోయిన సోదరుడు బైక్ పై తిప్పమన్నాడని.. ఓ తమ్ముడు ఏకంగా ఎవరూ చేయకూడని, చేయని పనిని చేశాడు. అదేంటి చనిపోయిన సోదరుడు తమ్ముడితో ఎప్పుడు మాట్లాడాడు.. ఎక్కడ మాట్లాడాడు. ఏమని చెప్పాడు.. అసలు మాట్లాడే అవకాశమే లేదు కదా... కానీ మరణించిన అన్న చెప్పాడని తమ్ముడు అన్న పేరును ఎందుకు పాడు చేస్తున్నాడు. అయితే పరలోకం నుంచి అతని ఆత్మ మాట్లాడిందా..? అంటే ఆత్మలు మాట్లాడతాయని చెప్పదలుచుకున్నాడా..? ఇంకా ఇలాంటి అనేక సందేహాలు మీ మదిలో కలుగుతున్నాయిన మాకు తెలుసు.

అయితే మీరు ఊహించినదంతా వేరు. ఇక్కడ జరిగింది వేరు. చనిపోయిన సోదరుడు తమ్ముడి కలలో కనిపించి.. తనను బైక్ పై తిప్పమన్నాడు. తాను బతికున్నప్పుడు ఎలా తిరిగానో అలాగే తామిద్దరం కలసి ఊరంతా తిరగాలని వుందని చెప్పాడట. అది ఆ తమ్ముడిని ఎవరూ చేయకూడని పనికి పురిగొల్పింది. వెంటనే తన అన్నను సమాధి చేసిన ప్రాంతానికి వెళ్లి తన అన్న సమాధిని తొవ్వి..  అన్న బౌతికకాయంతో వున్న శవపేటికను తీసి తన సైకిల్ పై ఊరంతా తిప్పి.. చివరకు తన ఇంటికి తీసుకువచ్చాడు. ఇది గమనించిన స్థానికులు తమ మొబైల్లో ఫోటోలు తీసి వాటిని పోలీసులకు పంపి పిర్యాదు చేశారు.

ఈ ఘటన బ్రెజిల్ లోని అగ్నేయ ప్రాంతం ప్రాటాలో జరిగింది. ఏఢాది క్రితం చనిపోయిన తన అన్నను తలుచుకుంటూ కుమిలిపోతున్న సోదరుడు ఎల్డర్లాన్డెస్ రోసా ఈ చర్యలకు పాల్పడటంతో స్థానికులు పిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. కలలో కన్పించిన తన అన్న బైక్‌పై తిరగాలని ఉందని చెప్పాడని.. అందుకే ఇలా చేశానని చెప్పాడంతో పోలీసులు నిర్ఘాంతపోయారు. ఆ తర్వాత రోసాని అరెస్ట్‌ చేసి కోర్టుకు తరలించగా అక్కడి న్యాయస్థానం అతనికి మూడేళ్ల జైలు శిక్ష విధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Brazil  man  Elderlandes Rosa  Eri Erisberto  rode  dead brother  coffin  bike  Prata  in southeast Brazil  police  sentence  

Other Articles

Today on Telugu Wishesh