US successfully intercepts ICBM in historic test ఎగిరి పడకు కొరియా..తొక కత్తిరిస్తామిలా..!

America successfully tests icbm defense system in the pacific

Department of Defense, icbm, military, missiles, kill vehicle, ballistic missile, US, North Korea, test fire

The Pentagon said it successfully used a “kill vehicle” to knock down an intercontinental ballistic missile over the Pacific Ocean as North Korea ramps up its belligerent behavior,

ITEMVIDEOS: ఎగిరి పడకు ఉత్తర కొరియా..తొక కత్తిరిస్తామిలా..! అగ్రరాజ్యం హెచ్చరిక.!!

Posted: 06/01/2017 11:57 AM IST
America successfully tests icbm defense system in the pacific

పక్కలో బల్లెంగా మారిన ఉత్తర కొరియా వైఖరిని తీవ్రంగా అక్షేపిస్తున్న అగ్రరాజ్యం అమెరికా.. పొరుగు దేశానికి మాటలతో కాకుండా ఏకంగా చేతలతోనే తమ బలమేంటో చూపాలనుకుంది. సరిహద్దులో సైన్యాన్ని మోహరించడంతో పాటు.. యుద్దవాతావరణం అలుముకునేలా.. తమ సైనిక విన్యాసాలు. ఆయుధాల ప్రదర్శనతో హోరెత్తిన్న క్రమంలో అగ్రరాజ్యం ఉత్తర కొరియాకు తమ సత్తాను కూడా తెలియజేయాలని అనుకుందా..? అంటే అవునన్నట్లుగానే అగ్రారాజ్యం తాజా చర్యలున్నాయి.

యుద్దం ఏ దేశానికి కూడా మంచిది కాదని, అన్ని దేశాలు శాంతికాముకులుగా వుండాలని ఓ వైపు ఐక్యరాజ్య సమితి సందేశాన్ని ఇస్తుంది. అయినా పట్టించుకోకుండా తమ చర్యలతో యుద్దానికి సన్నధం అవుతున్నట్లు గా సంకేతాలిస్తున్న ఉత్తర కొరియాకు తాజాగా తమ బలమేంటో కూడా చూపింది. అదే బాలస్టిక్ క్షిఫణిని కూల్చివేత. తొలి పరీక్షలోనే ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి(ఐసీబీఎం)ని అమెరికా విజయవంతంగా కూల్చింది. పోరుగు దేశానికి హెచ్చరికలను జారీ చేస్తూ ఈ మాక్‌ పరీక్షను అగ్రరాజ్యం నిర్వహించింది.

ఆధునీకరించిన మధ్యశ్రేణి ఇంటర్ సెప్టార్ వార్ హెడ్ సాయంతో అమెరికా బలగాలు ఈ ప్రయోగం చేపట్టాయి. మార్షెల్ ద్వీపంలోని క్వాజాలీన్ ఎటోల్ నుంచి అగ్రరాజ్య సైన్యం ఐసీబీఎం లాంటి ఆయుధాన్ని ప్రయోగించింది. దాన్ని కాలిఫోర్నియాలోని వైమానిక దళ స్థావరం నుంచి మరో క్షిపణితో కూల్చివేసిందని అగ్రరాజ్యం సైనిక బలగాలు వెల్లడించారు. ఈ క్షిపణి ప్రయోగానికి 244 మిలియన్‌ డాలర్లు ఖర్చు చేసినట్టు పెంటగాన్ అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో మరిన్ని క్షిపణులను పరీక్షిస్తామని వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Department of Defense  icbm  military  missiles  kill vehicle  ballistic missile  US  North Korea  test fire  

Other Articles