Odisha college girls dance has gone viral వీళ్లు కాలేజ్ గాళ్స్ కాదు.. వైరల్ గోళ్సే..!

Odisha college girls dance has gone viral big time with 10 million views

bhubaneshwar college girl dance video, college girls viral video, youtube has clocked 10 million views, odisha college girls dance, college girls from odisha, youtube, social media, viral video, 12 million views, odisha college girls, dance video, bhubaneshwar college, odisha, College Girls Flash Mob, Odisha Girls Flash Mob, Indian Girls Flash Mob

A R Rahman’s hit number Mukkala Muqabla is buzzing online again – thanks to a group of college girls Flash Mob reportedly from Odisha. Cheered on by friends, the group dances to the number impressively.

ITEMVIDEOS: అమ్మాయిల ఆ వీడియోతో యూట్యూబ్ క్రాష్

Posted: 06/01/2017 11:45 AM IST
Odisha college girls dance has gone viral big time with 10 million views

యువత అనుకుంటే సాధించలేనిది ఏదీలేదని మరోమారు నిరూపితమైంది. మరీ ముఖ్యంగా యువతులు తలచుకుంటే.. గగనానైనా కిందకు తీసుకురాగలరని.. అది వారిలోని సంకల్ప బలమని పెద్దలు చెప్పినట్లు గానే మరోమారు రుజువు చేశారు ఒడిశా అమ్మాయిలు. ఈ మధ్యకాలంలో ఫ్లాష్ డాన్స్ అనో లేక దబ్ స్మాష్ అనో పిలుస్తన్న డాన్స్ తో ఏకంగా ఒక ఊఫు ఊపుతున్నారు. వీరు కాలేజీ గ్రౌండ్లో చేసిన దబ్ స్మాష్ ను వీడియో తీసిన ఇతర విద్యార్థులు దానిని సోషల్ మీడియా యూట్యూబ్ లో అప్ లోడ్ చేయగా.. ఏకంగా సైట్ క్రాష్ అయ్యేలా వ్యూస్ పెరుగుతున్నాయి.

ఏఆర్ రహమాన్ సంగీత దర్శకత్వంలోని తొలినాళ్లలో ఆయన వేణువు నుంచి జాలువారి.. యావత్ దేశాన్ని ఆ పాటలలో ఒలలాడించిన పాటలు మరోమారు అన్ లైన్ లో వీరి వల్ల మళ్లీ ఫేమస్ అవుతున్నాయి. ఇక అప్పటి వరకు కొరియోగ్రాఫర్ గా మాత్రమే పరిచమైన ప్రముఖ నటుడు, దర్శకుడు ప్రభుదేవా హీరోగా కూడా పరిచయం అయిన చిత్రం ప్రేమికుడు చిత్రంలోని ముకాబులా పాటతో మొదలైన ఈ కాలేజీ గర్స్‌ దబ్ స్మాస్.. పలు బాలీవుడ్ చిత్రాలలోని ప్రముఖ పాటలతో సాగింది.

మొదట ఒక్క అమ్మాయి మాత్రమే ముకాబలా పాటకు డాన్స్ చేయడంతో ప్రారంభమైన దబ్ స్మాష్.. ఆ తరువాత యువతులు ఒక్కక్కరుగా చేరి ఏకంగా ష్లాష్ డాన్స్ గా మారింది. అంతాకలసి చిరవకి సామూహికంగా స్టెప్పులేశారు. అయితే ఇది గత ఏడాదిలో జరిగిందా లేక ఈ ఏడాది జనవరి 1న లేదా 2న నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా జరిగిందా అన్నది తెలియదు కానీ.. ఈ ఏడాది జనవరి 2న యూట్యూబ్ లో అప్ లోడ్ అయ్యింది. ఈ వీడియో నెటిజన్ల క్రేజ్‌తో ఏకంగా వైరల్ గా మారింది. దీనిని ఇప్పటి వరకు కొటి 27 లక్షల మంది వీక్షించగా, ఇంకా క్రేజ్ తగ్గిని వీడియోను అనేక మంది చూస్తున్నరు. మరెందుకు అలస్యం మీరూ ఒక లుక్కేయండీ..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles