kamal-haasan-satairs-on-rajinikanth రజనీ పోలిటికల్ ఎంట్రీపై కమల్ సన్నాయినొక్కులు...

No comments on rajini s hints of entry into politics haasan

kamal satires rajinikanth, kamal on localites demand, kamal advice to rajini, kamal change in political system, Kamal Haasan, Rajinikanth, Chennai, satire, political entry, tamils, localites, tamil nadu

Kamal Haasan today said he will not like to give any advice publicly to his friend Rajinikanth on latter's prospects of entering politics, although he endorsed his view that "the system is rotten."

రజనీ పోలిటికల్ ఎంట్రీపై కమల్ సన్నాయినొక్కులు..

Posted: 05/26/2017 08:05 PM IST
No comments on rajini s hints of entry into politics haasan

రాజ‌కీయాల్లోకి రాకుండానే.. దక్షిణాది సూపర్‌స్టార్‌ రజనీకాంత్ తన స్నేహితులతో సెటైర్లు వేయించుకుంటున్నారు. ఇప్పటికే తమిళసంఘాలు, పలు పార్టీలు రజనీకాంత్ రాజకీయాల్లోకి రావద్దంటూ హాడావిడి చేస్తున్న క్రమంలో వారితో పాటుగా మరో సూపర్ స్టార్, రజనీ స్నేహితుడు కమల్ హాసన్ కూడా కలిశాడా..? అంటే అవుననే సందేహాలే వస్తున్నాయి. ఇందుకు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలే బలాన్నిస్తున్నాయి. ఏకంగా తన స్నేహితుడిపై ఆయన ఇటు సెటైర్లు వేస్తూనే అటు రజినీ వ్యవస్థ మారాల్సిందేనన్న వ్యాఖ్యలతో ఏకీభవించి సన్నాయి నోక్కులు నోక్కాడు.

కెమెరాలు ఎక్కడుంటే అక్కడ రజనీకాంత్ కనబడతారంటూ నవ్వుతూ సెటైర్లు వేశారు. రజనీకాంత్ కు కెమెరాలు కనబడితే హడావుడి చేయడం అలవాటే అంటూ, అందుకే ఇలా హడావుడి చేస్తున్నారంటూ కమల్ వ్యాఖ్యానించారు. అయితే ఇటు ప్రజాస్వామ్య వ్యవస్థలో మార్పులు రావాలంటూ రజనీకాంత్ అభిమానులతో కలిసిన కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. ప్రస్తుతం ప్రజాస్వామ్యం వ్యవస్థ బాగోలేదని, మారప్ులు రావాలని అందరూ కోరుకుంటున్నారని అదే తన స్నేహితుడు కూడా చెప్పాడని కమల్ అన్నారు.

కాగా, రాజకీయ అరంగ్రేటం చేస్తానంటున్న తన మిత్రుడికి మీరు ఏదైనా సలహా ఇస్తారా..? అంటే సలహాలు సూచనలు ఇవ్వాల్సివస్తే అది మీడియా ముఖంగా ఇవ్వరాదని, వ్యక్తిగతంగా ఇవ్వాల్సి వుంటుందని అన్నాడు. ఇక తాను ఈ విషయమై పబ్లిక్ గా కామెంట్ చేయనన్నాడు. తమిళులే తమిళనాడు ముఖ్యమంత్రిగా కావాలని, వారే ఈ రాష్ట్రాన్ని శాసించాలన్న తమిళసంఘాల అభిప్రాయంతో ఆయన విభేధించారు. తమిళులు అభ్యున్నతి పాటుపడాలన్న కాంక్ష వున్న ఎవరైనా తమిళనాడుకు ముఖ్యమంత్రి కావచ్చునన్నారు. ముఖ్యమంత్రులుగా ఎన్నికైన వారు ఎన్ని ప్రదేశాలకు స్థానికులవుతారని కమల్ హాసన్ ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kamal Haasan  Rajinikanth  Chennai  satire  political entry  tamils  localites  tamil nadu  

Other Articles