nagam slams trs government రైతులకు బేడీలేసిన మొగాడు.. అవినీతిలో మొనగాడు..

Nagam janardhan reddy challenges kcr government on corruption

nagam janardhan reddy challenges kcr government on corruption, nagam fires on trs government, nagam janardhan reddy, bjp, kcr, telangana, sasikala

BJP leader Nagam Janardhan Reddy on lashed out at Telangana government says its fully involved in corruption and challenges if CM is ready he too is ready for debate on corruption.

రైతులకు బేడీలేసిన మొగాడు.. అవినీతిలో మొనగాడు..

Posted: 05/26/2017 06:46 PM IST
Nagam janardhan reddy challenges kcr government on corruption

రైతులకు బేడీలేసిన మొగాడు.. అవినీతిలో మొనగాడు.. ఎవరైనా వున్నారా అంటే అది ఒక్క తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని బీజేపి నేత నాగం జనార్థన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో అవినీతి రహిత పాలన జరుగుతుందని తనకు తాను ప్రకటించికుంటున్న ప్రభుత్వం.. ధమ్ముంటే అవినీతిపై ప్రగతి భవన్‌లో చర్చకు రావాలని డిమాండ్ చేశారు. ఇందుకు ముఖ్యమంత్రి సిద్దమని ప్రకటింస్తే తెలంగాణ ప్రభుత్వ అవినీతిని నిరూపించడానికి తాను కూడా సిద్దమని సవాల్ చేశారు.

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పంప్ హౌస్‌ పనులలో ఇప్పటి వరకు 2400 కోట్ల కుంభకోణం జరిగిందని ఆయన ఆరోపించారు. 50 కోట్ల రూపాయలుగా ఉన్న మోటార్లను.. ఎస్టిమేషన్ 90 కోట్లకు పెంచారన్న నాగం… మొత్తం 35 పంపింగ్ స్టేషన్స్ ఉన్నాయని తెలిపారు. ఆధారాలతో సహా ముఖ్యమంత్రికి లేఖ రాస్తే కనీసం స్పందించిన ఆయన తనది అవినీతి రహిత పాలన అని ఎలా ప్రకటించుకుంటారని మండిపడ్డారు. అవినీతిలో మొనగాడు కేసీఆర్ అన్న నాగం.. బీజేపీ జోలికొస్తే వస్తే ఖబర్దార్… అంటూ హెచ్చరించారు. కేసీఆర్‌పై ప్రజల్లో ఉన్న భ్రమలు తొలిగి పోతున్నాయని… రైతులకు భేడీలు వేసిన మొగోడివి నువ్వే అంటూ విమర్శించారు.

కేసీఆర్ ప్రభుత్వంలో విచ్చలవిడిగా అవినీతి జర్రుగుతోందని.. గతంలో ఈడీ, విజిలెన్స్ , సీవీసీకి ఫిర్యాదు చేసినట్లు నాగం పేర్కొన్నారు. తెలంగాణ ద్రోహి అయిన కేసీఆర్… అమిత్ షాను అవమానిస్తాడా.. కేసీఆర్ అవినీతే… తెలంగాణ ప్రగతికి అడ్డంకి అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చెప్పింది తప్పైతే తనమీద కేస్ పెట్టి జైలుకు పంపాలని సవాల్ విసిరిన నాగం… లేదంటే.. కేసీఆర్ స్థానం ఎక్కడో… తానే చూపిస్తానని వ్యాఖ్యానించారు.

ఐసిస్ ఉగ్రవాదులకు గులాబీ పూలు ఇచ్చి.. రైతులకు మాత్రం బేడీలు వేయడం కేసీఆర్ విధానమంటూ విరుచుకుపడ్డారు నాగం. రైతులకు కేంద్రం నుంచి 700కోట్లు ఇస్తే… ఎక్కడ ఖర్చు చెశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధి కోసమే కేసీఆర్ నీచాతినీచంగా దిగజారాడని విమర్శించారు. మళ్లీ నేనే సీఎం అనే భ్రమలోంచి కేసీఆర్ బయటకు రావాలని ఆయన సూచించారు. కేసీఆర్ కేరాఫ్ అడ్రెస్ అన్నాడీఎంకే నేత శశికళ ఉన్న చోటే అన్న నమ్మకం తనకు ఉందని ఉద్ఘాటించారు. అమిత్ షా నాయకత్వంలో… ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nagam janardhan reddy  bjp  kcr  sasikala  corruption  telangana  

Other Articles