Only CPM NCP accept EC's EVM Challenge

Only cpm ncp get evm test entry

Election Commission, EVM Challenge, EC's EVM Challenge, CPM and NCP. June 3 EC Challenge, EVM Tampering Row, EVM Hackathon Dare, NCP CPM, RJD Miss EVM Challenge

Only Two Parties to take up Election Commission's hacking challenge on 3 June. No Congress, no AAP, only CPM, NCP.

ఒక్క ఛాన్స్... అంతా సైలెంట్

Posted: 05/27/2017 07:42 AM IST
Only cpm ncp get evm test entry

ఈవీఎం ఛాలెంజ్ జూన్ 3న నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైపోయింది. ఈవీఎంలు ట్యాంపరింగ్ కావని, చేయలేరని ఎలక్షన్ కమిషన్ ఎంత చెప్పినా వినకుండా కొన్ని పార్టీలు నానా రభస చేశాయి. కానీ, ట్యాంపరింగ్ అయ్యాయయని గగ్గోలు పెట్టిన అవే పార్టీలు మూగబోయాయి. తమకు ఒక్క ఛాన్స్ అవకాశం ఇస్తే నిరూపించి చూపిస్తామని సవాలు విసిరి చివరి నిమిషంలో సైడ్ అయిపోయాయి. అయినా తాము రెడీ అంటూ డేట్, ప్లేస్ చెప్పేసింది ఈసీ.

ట్యాంపర్ చేసి చూపించాలని ఎలక్షన్ కమిషన్ దేశంలోని 7 జాతీయ పార్టీలు, 48 ప్రాంతీయ పార్టీలను ఆహ్వానించింది. దీంతో పార్టీల నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్టు అయింది. బీజేపీ, సీపీఐలు ఈ సవాలులో పాల్గొనడం లేదని ఇది వరకే ఈసీకి తెలపగా, మదర్‌బోర్డుల హ్యాక్‌కు అనుమతించాలని అసలు మొదటి నుంచి సినిమా మొదలుపెట్టిన ఆప్ కొత్త పల్లవి అందుకుంది. సవాలులోని నిబంధనలు సవరించాలంటూ కాంగ్రెస్ కోరింది. ఇలా ఏదో ఒక కారణంతో ఒక్కో పార్టీ సవాలు నుంచి తప్పుకున్నాయి. చివరకు మిగిలింది కేవలం రెండే. ఒకటి ఎన్‌సీపీ, రెండోది సీపీఎం.

ఎన్నికల సంఘం సవాలును ఈ రెండు పార్టీలు మాత్రమే స్వీకరించాయి. మరోపక్క పార్టీలు చేసిన అభ్యర్థనను ఈసీ తోసిపుచ్చింది. ఈ చాలెంజ్‌లో పాల్గొంటామని లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ శుక్రవారం లేఖ రాయగా, అది సాయంత్రం 5:39 గంటలకు ఈసీకి అందింది. అప్పటికే ఈసీ విధించిన గడువు ముగియడంతో దానికి పాల్గొనే అర్హత లేకుండా పోయింది. మరి ఎన్ సీపీ, సీపీఎంలు హ్యాక్ చేసి నిరూపిస్తాయో, లేక ఏదో కహానీ చెప్పి డ్రాప్ అవుతాయో తెలియాలంటే వచ్చే శనివారం దాకా వెయిట్ చేయాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : EVM Challenge  NCP and CPM  Election Commission  

Other Articles