Bomb attack kills at least 25 in Balochistan కాటేసిన ఉగ్రవాదం.. కారు బాంబు దాడిలో 25 మంది మృతి.!

25 killed in suicide attack senate deputy chairman injured

Abdul Ghafoor Haideri, roadside explosion, Balochistan, Jamiat Ulema-e-Islam-Fazl, Pakistan senate, car bomb, suicide bomb, Pakistan Prime Minister Nawaz Sharif, interior minister Chaudhry Nisar Ali Khan, crime

The deputy chairman of Pakistan’s upper house of parliament was injured and 21 people were killed when a suicide bomber targeted a convoy in the restive Balochistan province

కాటేసిన ఉగ్రవాదం.. కారు బాంబు దాడిలో 25 మంది మృతి.!

Posted: 05/12/2017 04:51 PM IST
25 killed in suicide attack senate deputy chairman injured

ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ మరోమారు అదే ఉగ్రవాద దెబ్బకు అంగళార్చింది. పాముకు పాలు పోసి పెంచినట్లేనని, ఇప్పటికైనా పాకిస్థాన్ ఉగ్రవాద బాట వీడాలని ప్రపంచ దేశాలు సూచిస్తున్నా.. వాటిని ఏ మాత్రం లక్ష్య పెట్టకుండా ఉగ్రవాదాన్ని మేము పెంచి ఫోషించడం లేదని నిసిగ్గుగా ప్రకటించుకుంటున్న పాక్.. ఇవాళ జరిగిన ఉగ్రదాడిలో ఒక్కసారిగా ఖంగుతినింది. ఉగ్రవాదులు ఏకంగా పాకిస్థాన్ ఎగువ సభకు చెందిన ఉపసభాపతిని టార్గెట్ చేసి ప్రయోగించిన కారు బాంబులో ఉపసభాపతి అబ్దుల్ గఫూర్ హైదరీ గాయాలతో బయటపడ్డారు.

పాకిస్థాన్ ఎగువ సభ ఉఫసభాపతిగా కొనసాగుతున్న జమైత్ ఉలేమా ఇ ఇస్లాం పజ్జల్ పార్టీకి చెందిన సీనియర్ నేత అబ్దుల్ గపూర్ హైదరీ.. ఉగ్రవాద ప్రాబల్య ప్రాంతం బలూచిస్థాన్‌ ప్రావిన్సులో ఓ మసీదులో జరిగిన కార్యక్రమానికి హాజరుకాగా, ఆయనను టార్గెట్ గా చేసుకున్న ఉగ్రవాదులు శక్తిమంతమైన కారు బాంబు పేల్చారు. ఈ పేలుడులో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ మధ్యాహ్నం ముస్తుంగ్‌ పట్టణంలోని మసీదులో జరిగిన కార్యక్రమానికి ఆయన హాజరై తిరిగి వెళ్తున్న సమయంలో ఈ బాంబు విస్పోటనం సంభవించింది.

ఈ దుర్ఘటనలో జమైతే ఉలేమా ఇ ఇస్లాం పార్టీకి  చెందిన కార్యకర్తలు, నేతలే మృతుల్లో అధికంగా వున్నారు. వీరితో పాటు పలువురు పట్టణవాసులు కూడా అసువులు బాసారని పాకిస్థాన్ అధికారిక రేడియో వెల్లడించినట్లు జాతీయ మీడియా కథనం. కాగా, ఈ ఘటనలో 35 మంది గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను హుటాహుటిన అస్పత్రులకు తరలిచిన భద్రతా సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. వీరిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటనకు కారకులెవరనేది తెలియరాలేదు. ఈ ఘటనలో హైద్రికి కూడా గాయాలయ్యాయి.. ఆయన ప్రయాణిస్తున్న వాహనం నుజ్జునుజ్జు అయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles