Politicians linked to Nayeem likely to be arrested

Nayeem links politicians may arrest soon

Gangster Nayeem, Nayeem Links, Gangster Nayeem Case, Vidyasagar Rao MLA Kishore, Gadari Kishore, Gadari kishore Nethi Vidyasagar Rao, Nayeem Binami Properties, TRS MLA MLC Arrest, Nayeem Police Links, Nayeem Cops Suspended, Nayeem Encounter, Nayeem Progress, Nayeem Case KCR, KCR Politicians Nayeem, Nayeem Telangana CID

Gangster Nayeem case Probe into individual charges may take time. After Cops suspension Politicians likely to be arrested.

నయీం లింకులు: వాళ్ల సంగతి ఏంటి?

Posted: 05/13/2017 07:59 AM IST
Nayeem links politicians may arrest soon

గ్యాంగ్‌స్టర్ నయీంతో దోస్తీ చేసిన వాళ్ల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఇప్పటికే డైరీ ఆధారంగా జరిపిన విచారణ తర్వాత ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో ఉన్న నేతలను కూడా విచారణ జరపాలంటూ ఒత్తిడి వస్తుండటంతో భవిష్యత్తులో వాళ్లను అరెస్ట్ చేసే అవకాశం రావొచ్చనే సంకేతాలు అందుతున్నాయి. ముఖ్యంగా మరీ దగ్గరి సంబంధాలు నడిపిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్, ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్‌లను కూడా విడిచిపెట్టే సమస్యే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

నయీం కేసులో ఇప్పటికే విద్యాసాగర్‌ను విచారించిన పోలీసులు ఆయనతోపాటు మరికొంతమంది నేతలపైనా చర్యలు సిద్ధమవుతున్నారు. అలాగే 20 మంది పోలీసు అధికారులపైనా చర్యలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. నయీంతో రాసుకుపూసుకు తిరిగిన మద్దిపాటి శ్రీనివాస్ (అడిషన్ ఎస్పీ, సీఐడీ), చింతమనేని శ్రీనివాస్‌ (సీసీఎస్‌ ఏసీపీ), మలినేని శ్రీనివాస్‌ (ఏసీపీ మీర్‌చౌక్‌), మస్తాన్‌ (సంగారెడ్డి ట్రాఫిక్‌ సీఐ), రాజ్‌గోపాల్‌ (సీఐ కొత్తగూడెం) తదితరులపై పోలీస్ శాఖ గురువారం వేటు వేసింది. రాజకీయ నేతల విషయంలో ముందుకే వెళ్లాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి కూడా పోలీసులకు స్పష్టమైన ఆదేశాలున్నట్టు తెలుస్తోంది.

ఇక మరోవైపు 25 మంది సిబ్బందిపై వేటువేసిన పోలీసు శాఖ వారిపై శాఖాపరమైన విచారణ జరిపించేందుకు సిద్ధమవుతోంది. విచారణలో వారు కనుక దోషులుగా తేలితే విధుల నుంచి తొలగించడంతోపాటు కేసు నమోదు చేసే అవకాశం కూడా ఉందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఐజీ చారుసిన్హా, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా ఉన్న ఐజీ శశిధర్‌రెడ్డి, కౌంటర్‌ ఇంటలిజెన్స్‌ డీఐజీగా ఉన్న రాజేశ్‌కుమార్‌ పేర్లను విచారణ బృందాలకు నేతృత్వ బాధ్యతలను అప్పగించే యోచనలో ఉన్నారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌లో పనిచేస్తున్న సీసీఎస్‌ డీసీపీ అవినాష్‌ మహంతి పేరును కూడా పోలీసు శాఖ పరిశీలిస్తోంది.

వాళ్లనేలా వదిలేస్తారు...

ఇక వేటుకు గురైన వారిలో ఓ అధికారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. నయీం ను వాడుకుని కొందరు కోట్లు గడించారు, వారిలో ఇప్పటికీ సర్వీసులో ఉన్నవారు కొందరైతే.. రిటైర్ అయిన వారు ఉన్నారు. వాళ్లందరినీ విచారించాలి. ఇప్పుడున్న వారిని వదలి తమపై వేటు వేసి తప్పించాలని చూస్తున్నారని, ఒకవేళ వాళ్లను గనుక విచారించకపోతే అనేక సంచలన కేసులు తిరగదోడాల్సి వస్తుందని హెచ్చరించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gangster Nayeem  Cops Suspend  Politicians Arrest  

Other Articles