biker charred to death in beed of maharashtra మానవత్వం తగలబడిపోయింది.. సెల్పీలు, ఫోటోలకు పరిమితమైంది..

Biker burns on road in maharashtra life goes on as usual for heartless passersby

biker charred to death, Biker burns on road, biker charred to death in beed of maharashtra, heartless passersby in beed of maharashtra, road accident, bike, biker, death, unconscious, heartless passersby, Parbhani, beed, maharashtra, crime

In a shocking incident, a man lay burning on a road in Maharashtra’s Beed district, but no one even stopped to inform the police as traffic moved seamlessly.

మానవత్వం మంటగలిసింది.. సెల్పీలు, ఫోటోలకు పరిమితమైంది..

Posted: 05/12/2017 03:35 PM IST
Biker burns on road in maharashtra life goes on as usual for heartless passersby

మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా లేదు చూడు మానవత్వం వున్నవాడు అంటూ ప్రజాకవి అందెశ్రీ రాసిన పాట ఏ సందర్భంలో రాశారో కానీ అదిమాత్రం పూర్తిగా మనుషులలో మృగ్యం అవుతున్న మానవ విలువల గురించిన ఆవేదన అని అర్థమవుతుంది. అంతేకాదు ప్రస్తుత సమాజంలో మనుషులు కోల్పోతున్న నైతిక విలువలకు, మారుతున్న తరంలో పెరుగుకుపోతున్న క్రూరత్వాన్ని కూడా ఎత్తిచూపుతున్నట్లు వుంది. హింస చేయడమే క్రూరత్వం కాదు.. కళ్లెదురుగా జరుగుతున్న దారుణాలను నిలువరించడలేకపోవడం కూడా క్రూరత్వమే అవుతుంది.

అందించచిన సాంకేతిక విప్లవాన్ని పునికిపుచ్చుకుంటున్న నేటి తరం.. దానిని మనుషలు అవసరాలు తీర్చేందుకు సద్వినియోగం చేయడం కన్నా తమ సరదాలను తీర్చుకునేందుకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ప్రమాదం బారిన పడిన వారిని కాపాడే పనులు మానుకుని కళ్లపగ్గించి చూడటంతో పాటు తమ సెల్ ఫోన్లలో వాటిని బందించేందుకే ప్రాముఖ్యతను ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వెల్లివిరుస్తున్నా.. మనుషులు మాత్రం మారడం లేదు. ప్రాణాలకు విలువనివ్వడం లేదు. తాజాగా మహారాష్ట్రంలోని బీడ్ జిల్లాలో జరిగిన ప్రమాదం ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది.

బీడ్ జిల్లాలోని జాతీయ రహదారిపై రెండు బైక్స్ ఎదురెదురుగా వచ్చి ఢీ కొన్నాయి. ఆ వాహనాలను నడుపుతున్న వ్యక్తులిద్దరూ కింద పడ్డారు. అయితే వాహనాలు మాత్రం వారికి కొంత దూరం వరకు అలాగే ఈడ్చుకెళ్లాయి. ఇద్దరు వాహనదారుల్లో ఒకరు తీవ్రగాయాలపాలైనా లేచి నిల్చున్నాడు. అయితే మరో వాహనదారుడు మాత్రం ప్రమాదం జరిగి వాహనం కిందపడగానే అపస్మారక స్థితిలోకి జారుకున్నాడు. అయితే అప్పటికే వాహనాల్లోని పెట్రోల్ రోడ్డుపై పడింది. వాహనాలు రోడ్డుపై ఈడ్చుకెళ్లడంతో.. ఆ రాపిడికి మంటలు చెలరేగాయి.

ఒక్కసారిగా చెలరేగిన మంటలతో అపస్మారక స్థితిలోకి జారుకున్న వాహనదారుడు సజీవ దహనమయ్యాడు. కనీసం స్తానికులను తనకు సాయం చేయాలని కూడా పిలిచే స్థితిలో లేడు. అయితే జాతీయ రహదారిపైనే వెళుతున్న కార్లు, బస్సులు, బైక్స్ అందరూ.. ఈ ప్రమాద ఘటనను చూస్తూనే ఉన్నారు కానీ.. ఒక్కరూ కూడా తమ వాహనాలను అపి సజీవ దహనం అవుతున్న వాహనదారుడ్ని కాపాడే ప్రయత్నం చేయలేదు. వీరి సంగతి పక్కనబెడితే.. చుట్టుపక్కల నుంచి వచ్చిన కొందరు కూడా వాహనదారుడ్ని కాపాడే ప్రయత్నం చేయకుండా తమ సెల్ ఫోన్లకు పని కల్పించారు. అదినూ ఫొటోలు, వీడియోలు తీయడానికి ఇది చూస్తే మీకేమనిపిస్తుంది.. వీల్లే వాహనదారుడ్ని సజీవ దహనం చేశారనిపించడం లేదా..? మనిషన్నవాడు మాయమైనట్లు అనిపించడం లేదా..? మానవత్వం వున్నవాల్లు ఎవరూనా మనిషికి కాపాడే ప్రయత్నం చేయకుండా ఫోటోలకు, వీడియోలకు పని కల్పిస్తారా..? అయితే సజీవ దహనమైన వ్యక్తి పర్బనీకి చెందినవాడుగా అనుమానిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : road accident  bike  biker  death  unconscious  heartless passersby  Parbhani  beed  maharashtra  crime  

Other Articles