'Insensitive' min says what govt can do if baby is raped అత్యాచారాలను ఎలా అరికట్టగలం..? మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

Cong condemns raj minister kalicharan saraf s hollow sensitivity

minister Kalicharan Saraf controversy, Kalicharan Saraf stirred controversy, Kalicharan Saraf govt cannot stop rape, Kalicharan Saraf remarks on molestation, Kalicharan Saraf remarks on rape, Bharatiya Janata Party, Congress, Rajasthan, BJP, minister Kalicharan Saraf, India news

Rajasthan minister Kalicharan Saraf stirred a controversy with his remark asserting that the government "cannot prevent rape incidences from taking place,"

అత్యాచారాలను ఎలా అరికట్టగలం..? మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

Posted: 05/11/2017 11:16 AM IST
Cong condemns raj minister kalicharan saraf s hollow sensitivity

బీజేపీ సీనియర్ నాయకుడు, రాజస్థాన్‌ మంత్రి కాళిచరణ్‌ సరాఫ్‌ రాజీనామాకు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగే నైతిక హక్కు సరాఫ్ కు లేదని ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక మంత్రిగా అవివేకంగా, అవగాహనా రాహిత్యంతో బాద్యత లేకుండా ఎలా మాట్లాడుతారని విపక్షాలు మంత్రి వైఖరిని తీవ్రంగా నిరసిస్తున్నాయి. అడపడచులు అత్యాచారాల బారిన పడకుండా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వమే చేతులెత్తేస్తే.. ఇక ప్రభుత్వాన్ని ఎన్నుకుని ఏం లాభమని ప్రశ్నిస్తున్నారు.

కాంగ్రెస్ నేతలు టామ్ వడక్కన్, ప్రమోద్ తివారీలు మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి తక్షణం ఆయన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే తక్షణం ఆయన నుంచి క్షమాపణలు కోరాలని, పదవి నుంచి కూడా భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతూ అత్యాచారాలను ఎలా అపాగలమంటూ వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని వారు దుయ్యబట్టారు. రాష్ట్ర మహిళలకు రక్షణ కల్పించలేనప్పుడు ఇక ప్రభుత్వం అడపడచులకు ఏం భరోసా ఇస్తుందని వారు ప్రశ్నించారు. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ కల్పించే బాధ్యత కూడా ప్రభుత్వాలదేనన్న విషయం కూడా మంత్రికి తెలియదా అని వారు ప్రశ్నలు గుప్పించారు.

సరాఫ్ పై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేయడానికి కారణం ఆయన సొంతంగా చేసిన వ్యాఖ్యలే. అబలలు ఎదుర్కోంటున్న అత్యాచారాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని లేపాయి. అత్యాచారాలను ఎలా అరికట్టగలం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. మైనర్‌ బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటనపై స్పందిస్తూ ఆయన వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ప్రతీ ఇంటి వద్ద పోలీసులను కపాలా పెట్టలేదని ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.

ఇంట్లో పనిచేసే వ్యక్తి యజమాని కూతురిపై అత్యాచారానికి పాల్పడిన ఘటనపై స్పందిస్తూ.. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు లేదా ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది.. మహా అయితే నిందితులకు కఠిన శిక్ష పడేలా చేస్తుంది.. బాధితురాలికి మెరుగైన వైద్యం కల్పించగలగుతుంది. అంతే తప్ప అత్యాచారాన్ని ఎలా అపగలుగుతుందని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా రాష్ట్రంలో ప్రతి ఇంటికి తాళం వేయాలని మీరు భావిస్తున్నారా? అని ఆయన మీడియాను ఎదురు ప్రశ్నించారు. అయితే రాష్ట్రంలోని మహిళామణులు తమకు కావాల్సిన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారంటే.. ఆ ప్రభుత్వం నుంచి రక్షణను, బధ్రతను కోరుకుంటారన్న కనీస విషయం కూడా తెలియకుండా మంత్రి సరాఫ్ వ్యాఖ్యనించడంపై విపక్షాలు, ప్రజా సంఘాలు మండిపడ్డాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bharatiya Janata Party  Congress  Rajasthan  BJP  minister Kalicharan Saraf  India news  

Other Articles