Youth severed head thrown into police station యువకుడి తలను పోలిస్ స్టేషన్ లోకి విసిరిన అగంతకులు

Youth hacked to death in puducherry severed head thrown into police station

Youth hacked to death in Puducherry, puducherry youth head thrown into police station, youth head thrown into caddalore police station, Bahoor, Crime, India, Murder, Police station, Puducherry, Tamil Nadu

A 17-year-old youth was hacked to death in Puducherry by members of an unidentified gang who severed his head and threw it inside a police station in neighbouring Tamil Nadu.

ITEMVIDEOS: దారుణం: యువకుడి తలను పోలిస్ స్టేషన్ లోకి విసిరిన దుండగులు

Posted: 05/11/2017 10:12 AM IST
Youth hacked to death in puducherry severed head thrown into police station

తమిళనాడులో దారుణం జరిగింది. తమిళనాడులోని కడలూరు పోలిస్ స్టేషన్ పోలీసులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఓ యువకుడి తలను నరికిన దుండగులు ఆ తలను సరాసరి తమిళనాడు జిల్లాలోని కడలూరు పోలిస్ స్టేషన్ లోకి విసిరేసి పారిపోయారు. నేరాలను చేధించే పోలీసులకు అగంతకులు సవాల్ విసిరారు. ఈ ఊహించని పరిణామంతో విస్మయానికి గురైన పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు కారణమా అన్న కోణంతో పాటు అస్తుల లావాదేవీల వ్యవహారంతో పాటు అన్ని కోణాల్లో కడలూరు పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.

మృతుడ్ని పుదుచ్చేరికి చెందిన శ్వేతన్ గా గుర్తించిన పోలీసులు.. అతని శరీరాన్ని పుదుచ్చేరిలోని లోని బాహోర్ గ్రామంలో వున్న నది ఒడ్డున పూడ్చిపెట్టినట్లు కనుగొన్నారు. దీంతో అటు తమిళనాడులోని కడలూరు పోలిసులతో పాటు ఇటు పుదుచ్చేరి పోలీసులు సంయుక్తంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి శవాన్ని అస్పత్రికి పంపిన పోలీసులు పోస్టుమార్టం నిర్వహించారు. అయితే యువకుడ్ని ఇంత దారుణంగా హత్య చేయడానికి గల కారణాలపై విస్మయం వ్యక్తం చేస్తున్న పోలీసులు.. మృతుడి బంధువులను కూడా విచారిస్తున్నారు.

పుదుచ్చేరికి చెందిన యువకుడి తలను ఏకంగా పోరుగు రాష్ట్రం తమిళనాడులోని పోలిస్ స్టేషన్ లో విసిరడంతో అతనిపై తీవ్రమైన కక్షవున్నవారే ఈ దారుణానికి ఒడిగట్టారని, ఇందుకు ప్రేమ వ్యవహరం కారణమా..? లేక దాయాదుల మధ్య అస్తుల పంపకాలు కారణమా.? అన్న విషయమై దర్యాప్తు చేస్తున్నారు. కాగా, సీసీటీవీ ఫూటేజీని పరిశీలించిన పోలిసులకు బైక్ పై వచ్చిన ఇద్దరు అగంతకులు యధేశ్చగా పోలిస్ స్టేషన్ ప్రధాన గేటు వద్ద బైక్ నిలిపి.. ఒక వ్యక్తి బైక్ పై నుంచి దిగి.. తలను తీసి పోలిస్ స్టేషన్ లోకి విసిరేసినట్లు స్పష్టంగా కనబడుతుంది. దీంతో బైక్ పై వచ్చిన ఇద్దరు ఎవరన్న విషయాలతో పాటు ఆ బైక్ నెండరు ఇతర సిసిటీవీ ఫూటేజీలలో లభ్యమైన వివరాలను తెలుసుకుంటూ పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bahoor  Crime  India  Murder  Police station  Puducherry  Tamil Nadu  

Other Articles