Woman held on charges of cyber crime మాదాపూర్ పోలీసుల అదుపులో మాయలాడి

Woman held on charges of cyber crime

Marketing Intelligence Team of Cyber Crimes, woman cheater in police trap, police arrested woman cheater, woman cheats many through favebook, cyber crime, cyber wing police, cyberabad police, vinamrata raman, facrbook, crime

Marketing Intelligence Team of Cyber Crimes arrested Vinamrata Raman (24) of Madhapur, who cheated many people by developing friendship through Facebook.

మాదాపూర్ పోలీసుల అదుపులో మాయలాడి

Posted: 05/11/2017 12:21 PM IST
Woman held on charges of cyber crime

యువతుల నుంచి అడ్ ఫ్రెండ్ మెసేజ్ రాగానే వాళ్లు ఎవరూ..? ఏమిటీ అంటూ కనీసం విచారణ కూడా చేయకుండా అడ్ బటన్ ను క్లిక్ చేసి.. వారితో చాటింగ్ చేసే యువకులు తస్మాత్ జాగ్రత్త..! పురుషులందు పున్య పురులు వున్నట్లుగానే మహిళలందు మాయలేడీలు కూడా లేకపోలేరు. మీ అవసరాలను అసరగా చేసుకుని బురిడీ కొట్టించగలరు. ఇప్పటికే తమ కుటుంబసభ్యులకు అత్యవసర చికిత్స ఉందనో, లేక వారికి అత్యవసరంగా పంపాలనో కధలను చెప్పి.. యువకుల నుంచి డబ్బును తీసుకుని.. వాటిని తిరిగి ఇచ్చేస్తామని బురిడీ కొట్టించి.. అందుకున్న డబ్బుతో ఉడాయించిన ఘటనలు అనేకం చూశాం.

అందివచ్చిన సాంకేతిక విప్లవంతో సోషల్ మీడియా కూడా అదే స్థాయిలో యువతీయువకులను అకర్షిస్తుందనడం అతిశయోక్తి కాదు. అయితే సోషల్ మీడియా చేసే హితాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాల్సిన యూజర్లు.. ఆ మీడియా చేసే కీడు నుంచి అప్రమత్తంగా వుండాల్సిన అవసరం వుంది. ఇలాంటి ఘటనను చవిచూసిన శుభమ్ గుప్తాకు అనుభవ పూర్వకంగా ఈ విషయం తెలిసివచ్చింది. శుభమ్ గుప్తాకు ఫేస్ బుక్ ద్వారా వినమ్రతా రామన్ అనే యువతితో పరిచయం ఏర్పడింది. అమె గోవాలో బస చేస్తున్నట్లు వారిద్దరి మధ్య ఛాటింగ్ ద్వారా తెలుసుకున్నాడు.

ఇదే క్రమంలో శుభమ్ గుప్తా కూడా గోవాను పర్యటనకు వస్తున్నానని తనను కలవాలని అమెతో చాటింగ్ సందర్భంగా చెప్పాడు. అయితే అదే అదనుగా చేసుకున్న వినమ్రత.. మీకు మంచి హోటల్ బుక్ చేయిస్తానని నమ్మబలికింది. దాంతో సరేనంటూ అమె బ్యాంక్ అకౌంటుకు 21 వేల రూపాయలను పంపించాడు గుప్తా. అయితే హోటల్ బుక్ చేసినట్లు కన్ఫామేషన్ ఇంకా రాకపోవడంతో వినమ్రతాకు ఫోన్ చేశాడు. అమె ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి వుండటంతో అందోళన చెందిన గుప్తా మాదాపూర్ పోలీసులను అశ్రయించి పిర్యాదు చేశాడు.

రంగంలోకి దిగిన పోలీసులు అమె మోబైల్ నెంబర్ అధారంగా, బ్యాంకు నుంచి నగదును డ్రా చేసిన వాటి అధారంగా అమెను అదుపులోకి తీసుకున్నారు. గతంతో ఈమె గోవా, పూణేలతో సాటు పలు ప్రాంతాలలో ప్రముఖ హోటళ్లలో పనిచేసినట్లు గుర్తించారు. ప్రస్తుతం హైలైఫ్ రెస్టారెంట్ లో జాబ్ చేస్తుందని తెలుసుకన్న పోలీసులు.. గతంలో అమె అనేక మంది యువకులను వారి అవసరాలను అసరాగా చేసుకుని వారి నుంచి నగదును తీసుకున్న తరువాత మోసం చేసిందని గుర్తించారు. తస్మాత్ జాగ్రత్త సుమా..!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cyber crime  cyber wing police  cyberabad police  vinamrata raman  facrbook  crime  

Other Articles