AP EAMCET Results 2017 Ranks Declared ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల

Ap eamcet 2017 results declared official website unresponsive

AP EAMCET Results, andhra pradesh eamcet results, ap eamcet engineering results, ap eamcet agriculture results, ap eamcet pharma results, Ganta Srinivasa Rao, Amravati, eamcet results released

The AP EAMCET 2017 results have been declared online at the official website today. The students be able to check AP EAMCET results, applicants can check results updates at AP EAMCET official website sche.ap.gov.in

ITEMVIDEOS: ఏపీ ఎంసెట్ ఫలితాలు.. మొరాయిస్తున్న అధికారక వెబ్ సైట్లు

Posted: 05/05/2017 03:42 PM IST
Ap eamcet 2017 results declared official website unresponsive

అంధ్రప్రదేశ్ ఎంసెట్ ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇవాళ అమరావతిలో ఎంసెట్ ఫలితాలను విడుదల చేశారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సులలో ప్రవేశాలకు గాను రాష్ట్ర విద్యాశాఖ నిర్వహించిన ఏపీ ఎంసెట్ ఫలితానలు మంత్రి గంటాతో పాటుగా మంత్రి కామినేని శ్రీనివాస్, మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డీలు విడుదల చేశారు. ఎంసెట్ ఇంజనీరింగ్ లో మొత్తం 79.74 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇదిలావుండగా, ర్యాంకులను చూసుకోవాలని విద్యార్థులు పోటీ పడుతుండటంతో అధికార వెబ్ సైట్లు తెరుచుకునేందుకు మొరాయిస్తున్నాయి.

తమకెంత ర్యాంకు వచ్చిందో తెలుసుకునేందుకు విద్యార్థులు పడుతున్న అసక్తిని అధికారిక వెబ్ సైట్లు నీరుగారుస్తున్నాయి. దీంతో అటు జాతీయ మీడియాలోనూ కథనాలు వచ్చాయి. అధికారిక వెబ్ సైట్లు తెరుచుకోవడం లేదని, అయితే సాయంత్రం ఐదు గంటల తరువాత విద్యార్థులు వీటిని ప్రయత్నించాలని పలు జాతీయ మీడియా చెప్పగా, ఇవాళ్టి బదులు రేపు విద్యార్థులు ప్రయత్నిస్తే ఫలాతాలు వెల్లడవుతాయని మరికొన్ని వెబ్ సైట్లు కథనాలను ప్రచురించాయి.

ఇక ఇంజనీరింగ్ విభాగంలో మొత్తంగా లక్షా 23 వేల 974 మంది విద్యార్థులు ప్రవేశాలకు అర్హత సాధించారని మంత్రి గంటా వెల్లడించారు. ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షలలో తొలి ర్యాంకును వి.మోహన్ అబ్బాస్, రెండో ర్యాంకును ఎ సాయి భరద్వాజ్, మూడో ర్యాంకును అర్ సత్యం, నల్గవ ర్యాంకును జయంత్ హర్ష, ఐదో ర్యాంకును వెంటక షణ్ముఖ్ సాయి మౌనిక్, అరో ర్యాంక్ వెంకట నిఖిల్, ఏడో ర్యాంక్ శశినాథన్ ఎనమిదవ ర్యాంక్ వెంకట సాయి, తొమ్మిదవ ర్యాంక్ వరుణ్ తేజ్, పదో ర్యాంకును చిన్మయి సాయినాగేంద్రలు సాధించారని తెలిపారు.

తొలిసారిగా అన్ లైన్ పద్దతిలో ఎంసెట్ పరీక్షలను నిర్వహించామని, దీని వల్ల పారదర్శకత ఉంటుందన్నారు. ఏపీలో 124 పరీక్షా కేంద్రాలు, హైదరాబాద్లో నాలుగు పరీక్షా కేంద్రాల ద్వారా పరీక్షలు నిర్వహించామని అన్నారు. ఈ సందర్భంగా గంటా ఇంటర్ రెండో సంవత్సరం పూర్తి చేయబోయే విద్యార్థులకు స్వీట్ న్యూస్ చెప్పారు. వచ్చే ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వమే ఇంజనీరింగ్ కోర్సులకు అర్హత పరీక్షలను నిర్వహిస్తుందన్న వార్తల నేపథ్యంలో రానున్న ఏడాది కూడా ఎంసెట్ పరీక్షలను తామే నిర్విహిస్తామని చెప్పారు. అయితే అపై వచ్చే సంవత్సరం మాత్రం ఎంసెట్ పరీక్షల నిర్వహణ ఎలా జరుగుతుందన్న విషయం కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయంపై అధారపడి వుంటుందని గంటా శ్రీనివాసరావు అన్నారు.

ఇక అగ్రికల్చరల్ విభాగంలో మొత్తంగా 55, 288 మంది విద్యార్థులు అర్హత సాధించారని మరో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. ఈ విభాగంలో మొదటి ర్యాంకును ఊటుకూరి వెంకట అనిరుధ్‌,
రెండో ర్యాంకును దుర్గా సందీప్‌, డో ర్యాంకును  నున్న హిమజ, నాల్గవ ర్యాంకును సాదినేని నిఖిల్‌ చౌదరి, ఐదో ర్యాంకును ఫణి శ్రీలాస్య, ఆరో ర్యాంకును మనోజ్‌ పవన్‌, ఏడో ర్యాంకును స్వాతికారెడ్డి, ఎనిమిదో ర్యాంకును కల్యాణ్‌, తొమ్మిదో ర్యాంకును సాయి శ్వేత, పదో ర్యాంకును అఖిల సాధించారని మంత్రి సోమిరెడ్డి తెలిపారు.

ఫలితాలు వెలువడిన అరగంట వ్యవధిలోనే విద్యార్థుల మొబైల్ ఫోన్లకు వారు సాధించిన మార్కుల వివరాలను తెలియజేసేందుకు కూడా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ నెల 12 నుంచి విద్యార్థులు తమ ర్యాంకు కార్డులను డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఇందుకు గాను www.sche.ap.gov.in వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని చెప్పారు. అయితే అందుకు వినియోగించాల్సిన పాస్ వర్డ్ apeamcet2017 అని కూడా గంటా శ్రీనివాసరావు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP EAMCET Results  Ganta Srinivasa Rao  Amravati  eamcet results released  

Other Articles