Victory for Nirbhaya: SC upholds death sentence ఆ కామాంధులకు ఉరే సరి.. తేల్చిచెప్పిన ‘‘సుప్రీం’’

Nirbhaya rapists to hang as supreme court upholds death sentence

death penalty to nirbhaya convicts, delhi gang rape convicts, sc upholds death sentence to nirbhaya convicts, nirbhaya case death sentence to convicts, nirbhaya gangrape case, nirbhaya gangrape case 2012, sc nirbhaya gangrape order, nirbhaya gangrape case, delhi gangrape case

Supreme Court upheld the death sentence awarded to four convicts in the 2012 Delhi gangrape case by a Delhi fast-track court in 2013 and subsequently the Delhi High Court in 2014, rejecting the appeal filed by the convicts.

ITEMVIDEOS: ఆ కామాంధులకు ఉరే సరి.. తేల్చిచెప్పిన ‘‘సుప్రీం’’

Posted: 05/05/2017 02:41 PM IST
Nirbhaya rapists to hang as supreme court upholds death sentence

దేశంలో పెను సంచలనం రేపిన నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులో నిందితులకు ఉరే సరైన శిక్ష అని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. ఈ కేసులో ఢిల్లీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు 2013లో, ఢిల్లీ హైకోర్టు 2015లో వెలువరించిన తీర్పులను అత్యున్నత న్యాయస్థానం సమర్ధించింది. ఈ కేసులో నలుగరు దోషుల దాఖలు చేసిన పిటీషన్లను తోసిపుచ్చిన సుప్రీం.. తుది తీర్పును వెలువరించింది. దోషులకు ఉరిశిక్షే సరైందని తీర్పును వెల్లడించింది.

ఈ కేసులో అమరురాలైన నిర్భమ మరణవాంగ్మూలాన్ని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం ఈ ఘటనను నేరపూరిత కుట్రగా దృవీకరిస్తూ.. నిందితులకు కింది కోర్టులు విధించిన శిక్షను సమర్థించింది. అయితే తమకు ఉరి శిక్షకు బదులు మరేదైనా శిక్షను విధించాలని దోషులు అక్షయ్ థాకూర్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముఖేష్ సింగ్ దాఖలు చేసిన పిటీషన్లను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ తీర్పును జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్ తో కూడిన ధర్మాసనం వెలువరించింది.

2012 డిసెంబర్ 16న దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ ఘటన యావత్ దేశ యువతను కదిలించింది. బస్సులో ఎక్కిన 23 ఏళ్ల నిర్భయ, అమె స్నేహితుడిని టార్గెట్ చేసిన దోషులు అమె స్నేహితుడిపై దాడి చేసిన తరువాత నగ్నంగా చేసి తోసేసిన తరువాత.. నిర్భయపై వంతులు మార్చుకుంటూ అత్యాచారం చేశారు. ఢిల్లీ వీదుల్లో బస్సు తిరుగుతున్న సేవు వారి అమెపై దారుణానికి ఒడిగట్టారు. అనంతరం బాధితురాలని కూడా నగ్నంగా చేసి కదిలే బస్సులోంచి తోసేశారు.

ఈకేసులో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిందితులను దోషులుగా పరిగణిస్తూ వారికి ఉరి శిక్ష విధించాలని ఏడాదిలోపు తీర్పును వెలువరించింది. దీంతో ధోషులు ఢిల్లీ హైకోర్టును అశ్రయించగా, అక్కడ కూడా వారికి చుక్కెదురైంది. దీంతో వారు ఏకంగా సర్వోన్నత న్యాయస్థానం తలుపుతట్టారు. అయితే ఇక్కడ కూడా త్రిసభ్య ధర్మాసనం వారికి వ్యతిరేకంగానే తీర్పును వెలువరించింది. ఈ కేసులో దోషిగా వున్న మైనర్ బాలుడు శిక్షను పూర్తి చేసుకున్న తరువాత వెళ్లగా, మరో నిందితుడు రాం సింగ్ జైలులోనే ఉరివేసుకుని అత్మహత్యకు పాల్పడ్డాడిన విషయం తెలిసింది.

 

డిఫెన్స్ లాయర్ సంచలన వ్యాఖ్యలు 

‘నిర్భయ’ కేసులో తీర్పు వెలువడిన అనంతరం కోర్టు బయట ‘నిర్భయ’ డిఫెన్స్ లాయర్ ఏపీ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ తీర్పు జాతిపిత మహాత్మా గాంధీ ప్రబోధ అసింస సిద్ధాంతానికి విరుద్ధమని, సమాజానికి ఏదో సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో కోర్టులు ఉరిశిక్షలు వేయడం సరికాదని, ఈ తీర్పుతో మానవహక్కులు హత్యకు గురయ్యాయని విమర్శించారు. ఈ తీర్పుతో తమకు న్యాయం జరగలేదని, రివ్యూ పిటిషన్ దాఖల చేస్తామని ఏపీ సింగ్ పేర్కొన్నాడు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles