Gaikwad welcomes no-fly list rules నో ఫ్లై లిస్టు రూల్స్ స్వాగతించిన శివసేన ఎంపీ

No fly draft rules in place unruly passengers may be suspended

Bharatiya Janata Party-Shiv Sena government,MP Ravindra Gaikwad,no-fly list,Ravindra Gaikwad,Shiv Sena, domestic airlines, airlines, domestic terminals, no fly list rules, shivsena mp, ravindra gaikwad, ashokgajapathi raju, news, India news, latest news

Welcoming the no-fly list Shiv Sena MP Ravindra Gaikwad, said that the aviation cannot ban him as he did not do anything wrong but for the safety of the passengers, this should have been earlier.

దేశీయ విమానయాన నిబంధనలను స్వాగతించిన గైక్వాడ్

Posted: 05/05/2017 04:24 PM IST
No fly draft rules in place unruly passengers may be suspended

విమానయాన సిబ్బందితో తరచూ గొడవపడటం. వారి పట్ల దురుసుగా ప్రవర్తించడం చేస్తున్న ప్రయాణికుల పట్ల కేంద్ర తాజాగా నో ఫ్లై రూల్స్ జాబితాను సిద్దం చేయడాన్ని శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌ స్వాగతించారు. విమాన సిబ్బందితో పాటు తోటి ప్రయాణికుల పట్ల అసభ్యంగా వ్యవహరించడం లాంటి వేర్వేరు నేరాలకు గాను మూడు నుంచి రెండేళ్ల వరకు విమానాల్లో ప్రయాణించకుండా సస్పెన్షన్ విధించనున్నారు. ఈ విషయాన్ని ఇవాళ కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు ఇవాళ ప్రకటించారు. ఈ ప్రకటన చేయగానే దీనిపై స్పందించిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఈ తాజా నిబంధనలను స్వాగతించారు.

అయితే ఇలాంటి నిబంధనలను ఇంతకుముందే ఏర్పాటు చేయాల్సివుండిందని అభిప్రాయపడ్డారు. అయితే తన విమానయానంపై మాత్రం వేటు వేయడాన్ని అయన పూర్తిగా వ్యతిరేకించారు. తనపై విమానయాన నిషేధాన్ని కొనసాగించాలనుకున్న విమాన సంస్థ నిర్ణయం పూర్తిగా తప్పని చెప్పుకోచ్చాడు. తాను ఏ తప్పు చేయలేదని, ఆయన పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలకు తాను కట్టుబడి వున్నట్లు చెప్పాడు. తన బిజినెస్ క్లాస్ సీటును ఎకానమీ క్లాసుకు మార్చడం విమాన సిబ్బంది చేసిన తప్పని చెప్పాడు.

ఇదిలావుండగా, తాజాగా అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం ఇకపై ఇలాంటి సంఘటనలకు పాల్పడే ప్రయాణికులను ‘నో ఫ్లై లిస్ట్‌’లో చేర్చనున్నారు. ఒక్కసారి ఈ లిస్టులో పేరు నమోదైతే ఇక అతను ఏ విమానంలోనూ ప్రయాణించే వీలు ఉండదు. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించినా, విమానాశ్రయంలో గానీ, విమానంలో గానీ, సిబ్బందితో ఘర్షణకు దిగినా ఆ వ్యక్తి నేరం చేసినట్లుగా భావించి అతని పేరును ‘నో ఫ్లై లిస్టు’లో నమోదు చేస్తారు. దీంతో అతను విమాన టికెట్లు బుక్‌ చేసుకునే వీలుండదు.

ప్రయాణికుడి ఆధార్‌ తదితర వివరాల ద్వారా లిస్టులో ఉన్న వారిని గుర్తిస్తారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకునే తాము ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది తెలిపారు. ‘నో ఫ్లై లిస్టు’లో పేరు నమోదైన వారిపై కొంతకాలం మాత్రమే నిషేధం అమల్లో ఉంటుంది. ఆ తర్వాత సరైన ఆధారాలు చూపి యథావిధిగా విమాన ప్రయాణం చేయవచ్చు. దేశంలోని విమానయాన సర్వీసులకు మాత్రమే ఈ నిబంధనలు అమలుకానున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles