In a setback to merger talks between the AIADMK rival factions, Chief Minister E Palaniswamy and rebel leader O Panneerselvam blamed each other, while eps government started to probe corruption cases against ops.

Palanisamy government to probe panneerselvam corruption cases

AIADMK,Chennai,E Palaniswami,Election Commission,NewsTracker,O Panneerselvam,Politics,Tamil Nadu Chief Minister,TTV DInakaran,VK Sasikala

In a setback to merger talks between the AIADMK rival factions, Chief Minister E Palaniswamy and rebel leader O Panneerselvam blamed each other, while eps government started to probe corruption cases against ops.

పన్నీరు అవినీతి కేసులను తిరగదొడుతున్న పళని సర్కార్..!

Posted: 05/03/2017 10:37 AM IST
Palanisamy government to probe panneerselvam corruption cases

vఅన్నాడీఎంకే పార్టీలో చీలికలకు కారణమై.. ఏకంగా తమ పార్టీ పెద్దలు కటకటాల పాలు చేసిన పన్నీరు సెల్వం.. ఆయన వెనకనున్న జాతీయ నేతలకు దిమ్మదిరిగే షాక్ ఇచ్చే యోచనలో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రభుత్వం జూలు విదిల్చింది. శశికలను అక్రమాస్థుల కేసులో బెంగళూరు పరప్పనా అగ్రహారం జైలుకు తరలించడం.. పనిలో పనిగా ఉప ఎన్నికల పేరుతో టీటీవీ దినకరణ్ పై ఏకంగా నిధుల దారిమళ్లింపు కేసును నమోదు చేసి ఈడీ విచారించడం.. అంతకుముందు రెండాకుల పార్టీ గుర్తు కేసులో ఎన్నకల కమీషన్ కే లంచం ఇవ్వజూరన్న కేసులో అరెస్టు చేయడం, ఇక తాజాగా 15 మంది పళనిసామి మంత్రులకు ఈడీ కేసులు పంపుతున్నారన్న వార్తలు రావడం.. ఇలా పన్నీరు సెల్వం అయన వెనకనున్న పెద్దలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతుంది

దీంతో తమ మంచితనాన్ని చేతగాని తనంగా భావిస్తున్న క్రమంలో పళనిస్వామి ప్రభుత్వం కూడా పావులు కదపడం ప్రారంభించింది. అమ్మ బెంగళూరు కోర్టులో జైలు శిక్షను అనుభవించిన కాలంలో రెండో పర్యాయం ముఖ్యమంత్రి పగ్గాలను అందుకున్న పన్నీరు సెల్వం అమ్మ అరెస్టు బాధపడకుండా తాను ముఖ్యమంత్రినయ్యానన్న సంబరంలో తన బందుమిత్రలకు పార్టీ ఇచ్చి.. ఘనంగా సెలబ్రేట్ చేసుకుకన్న నేపథ్యంలో అమ్మ ఆయనను జైలుకు వెళ్లినా కలవడానికి కూడా సిద్దపడలేదన్న వార్తలు వచ్చాయి. దీంతో అసలు పన్నీరు సెల్వం నిజమైన స్వరూపం ఏంటో తమిళ ప్రజలకు చూపాలని.. అమ్మ అండవుండటంతో ఇన్నాళ్లు అయన అవినీతి బాగోతాలు అనేకం వెలుగుచూసినా.. దానిపై చర్యలు తీసుకోలేదన్న విమర్శల నేపథ్యంలో పళనిస్వామి ప్రభుత్వం ఇప్పుడు వాటిని తిరగదోడే పరిస్థితుల్లో వుంది.

ప్రజల ముందు కనిపిస్తున్న సౌమ్యుడు పన్నీరు కాదని పళని సర్కార్ రుజువు చేయాలని భావిస్తుంది. ఈ తరుణంలో ఆయన అవినీతి చిట్టాను బయటకు తీయాలంటూ అధికారులను ఆదేశించారు. పన్నీరు ఏకంగా తమ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయించి.. మద్యంతర ఎన్నికల కోసం అటు కేంద్రంలో అధికారంలో వున్న బీజేపితో కలసి పావులు కదుపుతున్నారన్న అనుమానాల నేపథ్యంలో పళని ప్రభుత్వం కూడా తామేంటో నిరూపించుకునే క్రమంలో అడుగులు వేస్తుంది. ఇటీవల పళనిస్వామి మాట్లాడుతూ తమ సత్తా ఏంటో, తమకు ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు ఉన్నారో చెబుతూ విలీనం ప్రసక్తే లేదని చెప్పకనే చెప్పారు.  ఇప్పుడు ఏకంగా పన్నీర్ అవినీతిని బయటకు తీయాలని ఆదేశించడం తమిళ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

పన్నీర్ సెల్వం ఆర్థికమంత్రిగా వున్న ఆరేళ్ల కాలంలో చేసిన అవినీతి జాబితాను బయటకు తీసి సిద్ధం చేయాల్సిందిగా సీఎం ఆదేశించారు. అలాగే క్వారీల వ్యవహారంలో కాంట్రాక్టర్ శేఖర్‌రెడ్డితో ఉన్న సంబంధాలపైనా పళనిస్వామి దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఈనెల 5వ తేదీ నుంచి పన్నీర్ సెల్వం రాష్ట్ర పర్యటన జరపనున్న నేపథ్యంలోనే సీఎం వ్యూహాత్మకంగా ఆయన అవినీతి గురించి మాట్లాడుతున్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చర్చలకు మేము సిద్దమంటూ సంకేతాలు పంపిన పన్నీరు వర్గం.. దాగుడుమూతలు అడుతూ తమ ప్రభుత్వానికే ఎసరు తెచ్చే చర్యలకు పాల్పడుతున్న  నేపథ్యంలో పళని ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకుంటుందని రాజకీయ విశ్లేషకులు బావిస్తున్నారు.

ఇక ఏకంగా ప్రజల్లోకి వెళ్లేందుకు పన్నీరు సిద్దం అవుతున్న నేపథ్యంలో దాని వెనకునన్న అంతరార్థాన్ని గ్రహించిన పళనిసామి ప్రభుత్వం.. ఇక అయన అవినీతిని బహిర్గతం చేసి అయనతో పాటు అయన వర్గాన్ని ముప్పుతిప్పలు పెట్టాలని బావిస్తుంది. అయితే పన్నీరు వ్యూహాత్మకంగా కదుపుతున్న చర్యలకు చెక్ పెట్టే క్రమంలో పళని ప్రభుత్వ వుండటంతో ఇరువర్గాల మధ్య వైరి కాస్తా డీఎంకేకు లాభం చేకూర్చుతుందని విశ్లేషకులు  భావిస్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AIADMK  Chennai  E Palaniswami  O Panneerselvam  merger talks  Politics  Tamil Nadu  

Other Articles